వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : ఆ వరద భీభత్సం ధర్మశాలలో కాదు... జపాన్‌లో...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. భారీ వరదలకు ధర్మశాలలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. వీధుల్లో పార్క్ చేసిన కార్లు నీళ్లలో పడవల్లా కొట్టుకుపోయాయి. తాజాగా ధర్మశాలలో వరద బీభత్సానికి భారీ కొండచరియ విరిగిపడినట్లుగా ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది.

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి... 'ధర్మశాలలో మరో భయంకరమైన వర్ష భీభత్సం. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఆశిస్తున్నా.' అనే కామెంట్‌ను జత చేశారు. అయితే వన్‌ఇండియా టీమ్ ఇది ఒరిజినలా కాదా అని కనుగొనే ప్రయత్నం చేయగా ఫేక్ అని తేలింది. నిజానికి ఇది ధర్మశాలకు సంబంధించిన వీడియో కాదు. గతంలో జపాన్‌లోని అటామీ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియ విరిగిపడి అక్కడి ఇళ్లు,వాహనాలు,భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ ఘటనలో చాలామంది చనిపోగా 19 మంది మిస్సయ్యారు.

Fact check: Video from Japan being shared as visuals of landslides from Dharamshala

అప్పటి ఆ జపాన్ వీడియోను ఇప్పుడు ధర్మశాలతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.కాబట్టి నెటిజన్లు దీన్ని ఫేక్‌ అని గమనించగలరు. ఇదొక్కటే కాదు ఇలాంటి వీడియోలు ఫేక్ వీడియోలు చాలానే సర్క్యులేట్ అవుతున్నాయి. గతంలోనూ ఇతర దేశాల్లో జరిగిన వరద భీభత్సాలను భారత్‌లో జరిగినట్లుగా చూపిస్తూ కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. కాబట్టి ప్రజలు ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Fact Check

వాదన

ధర్మశాలలో భారీ వరదల ఉధృతికి కొండచరియ విరిగిపడినట్లు ప్రచారం జరుగుతోంది.

వాస్తవం

ఆ వీడియో ధర్మశాలకు సంబంధించినది కాదు. అది జపాన్‌లో జరిగిన సంఘటన.

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A video has been shared of a massive landslide and it is claimed that this took place in Dharamshala. One Twitter user shared the video with the caption, 'another frightful video of cloudburst in Dharamshala. Hope no one lost his life in this flood.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X