వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎప్పటికప్పుడుప్రజల నుంచి కాంగ్రెస్‌ నాయకుల నుంచి,నక్సలైట్ల నుంచి వ్యతిరేకతఆచరణ రూపంలో వ్యక్తంఅవుతుండడంతో పులిచింతల ప్రాజెక్టుపనులు ముందుకు సాగని స్థితి నెలకొంది.నల్లగొండ కాంగ్రెస్‌ శాసనసభ్యులుచేతులు ముడుచుకుని ఏ గదుల్లో నక్కికూర్చున్నారో అర్థం కాని స్థితి. తెలంగాణప్రజలు ఇంత బాహాటంగా మోసానికి, అన్యాయానికిగురి అవుతున్నారు. ఇప్పుడే ఇంతగాజరుగుతుంటే ఈ యాబై యేళ్ల కాలంలో ఏవిధంగా తెలంగాణ ప్రజలను మోసంచేశారో అర్థం చేసుకోవచ్చు.     పులి నోట్లోతెలంగాణ-కె. నిశాంత్‌పులిచింతలప్రాజెక్టు విషయంలో గతముఖ్యమంత్రులు చేయలేని పని డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చేశారు.అందుకు కృష్ణా డెల్టా రైతాంగంఆయనకు ఎల్లవేళలాకృతజ్ఞతాబద్ధులై వుంటారు. అక్కడిరాజకీయన నాయకులు కూడా ఆయనపక్షాన కచ్చితంగా చేరిపోతారు. గతముఖ్యమంత్రులు యన్‌.టి.రామారావు, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి,నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టునుఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టాలనేసంకల్పంతోనే ముందుకు సాగారు.అయితే దానికి నల్లగొండ జిల్లా ప్రజల నుంచి,రాజకీయ నేతల నుంచి వ్యతిరేకతఎదురవుతూ వచ్చింది. దాంతో వారిసంకల్పం కార్యరూపంధరించలేకపోయింది. ఈ ప్రాజెక్టునిర్మాణానికి కృష్ణా డెల్టా రాజకీయనాయకులు ఎన్నారై నిధులను కూడాసేకరించారు. పెద్ద యెత్తునప్రాజెక్టుకు అనుకూలంగా లాబీయింగ్‌నడిపారు. శుక్రవారం రాజశేఖర్‌రెడ్డి చేసిన భూమి పూజతో వారి కష్టంఫలించినట్లే భావించి వుంటారు.

By Staff
|
Google Oneindia TeluguNews

సాహిత్యరచనగాని, సినిమా గాని యితరత్రా ఏసృజనాత్మక రంగం తీసుకున్నా,అభివ్యక్తీకరణకు చెందిన ఏమాధ్యమం తీసుకున్నా అందులో నేటిసమాజం పడుతున్న దుర్భరాల గురించిగాని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనడమంత్రపు నడత గురించి గానిపట్టించుకుని మెదడులో కాస్తయినాచోటిచ్చి స్పందించ నిరాకరించే వారంతారోమ్‌ తగలబడుతుంటే ఫిడేల్‌వాయిస్తూ స్వీయానందంతో కాలం గడిపేనీరోకి వారసులే అవుతారు.మనసమాజం తగలబడుతోంది. కొన్ని జాతుల,సమాజాల సమూహమే మన దేశం.మన దేశం తగలబడుతోంది. మంటలులేచినప్పుడు గత కాలపు చెడుతగలబడితే ఫర్వాలేదు. దానితో పాటుకొంత మంచి కూడా తగలబడితేతప్పనిసరిగా కాబట్టి అట్లా జరిగి వుంటుందిఫర్వాలేదని పునర్నిర్మాణానికిపూనుకుంటామని సర్ది చెప్పుకోవచ్చు. కానీ,యా మొత్తం విధ్వంసంలో సర్వానికిమూలమైన మానవత్వమేతగలబడితే మిగిలేది భస్మమే. మహాస్మశానమే.ఒకవైపున కళ్ల ముందు జరిగేఅన్యాయాలకు స్పందించిన నీరో అనుయాయులు,అంటే సర్కారీ వృత్తి కళాకారులు, వృత్తికళాకారులు, వృత్తి రచయితలు,వృత్తి ఆలోచనాపరులు సుఖంగా ఉండగా,మరొకవైపున సామాన్యుల బాధలుతమ బాధలుగా భావించి స్పందించేనిజమైన మేధావులు, కవులు,రచయితలు, క్రియాత్మకఆలోచనాపరులు మనకు వున్నారు. కాని,యివాళ వారి సంఖ్య తక్కువ. నిజమైనమైనారిటీలు వీరే. వీరి అధ్యయనపూర్వక రచనలు ఎప్పటికప్పుడుప్రచురిస్తూ, నూత్న వరవడినిసృష్టిస్తూ ప్రజాభిప్రయాన్ని కూడగట్టేపత్రికలు తగినన్ని లేవు. వున్న కాసినిపత్రికలూ చిన్నవి. వీటికి నిబద్ధత వుంది.అయినా, యా ఆలోచనలు ప్రజలందరి దృష్టికితీసుకెళ్లే పరిస్థితిలో యివి లేవు. ఒకవేళ కొంతవరకు తీసికెళ్లినా, అది ఒకఉద్యమ రూపం తీసుకున్న దానిని దెబ్బతీయడానికి వెలుపల యితర శక్తులుఎప్పుడూ సిద్ధంగానే వుంటాయి.అందువల్ల యా చిన్న పత్రికలు ప్రజలకువుపయోగపడే రచనలు చేయడంతోపాటు తమ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడుకాపాడుకోవడానికి సర్వశక్తులతోపోరాడవలసి వస్తున్నది. ఈ మార్గంలోనిప్రయాణం ఆర్థికంగా కష్టమైనది.లక్ష్యాన్ని నిలుపుకు రావడం మరింతక్లిష్టమైంది.ఎందుకంటేపెద్ద పత్రికలది ప్రధానంగా వ్యాపారలక్ష్యం. వీటి పోటీ ముందు చిన్నపత్రికలు మనుగడం సాగించడందుర్లభం. పెద్ద పత్రికలువ్యాపారపరంగా పుంజుకోవాలనే పరుగులోజనాకర్షణ, కాలక్షేపం మొదలైనవాటిని ఎంచుకుంటాయి. ఇది గాక, ఏదో ఒకరాజకీయ పార్టీకి, లేక దానికి చెందినవ్యాపారుల అవసరాలు తీర్చే లాబీనిర్వహించే స్థాయికి వెడతాయి.అధికారంలో వున్న పాలకులనువిమర్శిస్తున్నట్లు కనబడుతూపరోక్షంగా మద్దతు పలుకుతాయి. ఆవిధంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికిప్రయత్నిస్తూ ఉంటాయి.కోవర్టులుఏ ఒక్క రంగానికో పరిమితమైనవారుకాదు, అన్ని రంగాల్లోనూ వున్నారు.ఈమొత్తం వ్యవహారంలో సృజనాత్మకరచన ముఖ్యోద్దేశమే పూర్తిగావెనక్కి నెట్టివేయబడుతుంది.సామాజిక కార్యకలాపంతో రచయిత,అతని రచన ముఖ్యం కాదనే భ్రమనికల్పించడం జరుగుతుంది. ఇది ఎంతదూరం వెళ్లిందంటే - రచనలుమనుషులను మార్చగలవా? అనిప్రశ్నించడం, అంటే - సాహితీ ప్రక్రియప్రజలను అసలు ప్రభావితం చేయగలదా? అనిప్రశ్నించే స్థాయికి చేరుకుంది.రచనలు మనసును ప్రభావితంచేస్తుందని, అంటే ఒక మంచి రచనఉత్తమ లక్ష్యాన్ని, ఆదర్శాన్ని మనసులోప్రతిష్టిస్తుందని, మార్గదర్శకత్వంవహిస్తుందని, విలువైన విలువలతోనిర్భయ జీవితాన్ని గడిపే ధైర్యాన్నియిస్తుందని - యిటువంటి ఎన్నో కోణాల్లో అదిపని చేస్తుందనేది గమనించకుండా,మొత్తం తుంగలో తొక్కి, రచనాకార్యకలాపం కాలక్షేపంకోసమేనన్నట్లు తేల్చేశారు కొందరువ్యాపార మహానుభావులు. దీని వల్లఆంధ్రదేశంలో నిజ రచయితవ్యక్తిత్వ స్వయం ప్రకాశత్వంకొంత కొడిగట్టింది. రాజకీయ కవులు,రచయితల సంఖ్య పెరిగి, యా ధోరణికిజవాబుగా పని చేస్తే మంచి ఫలితాలు చేకూరేఅవకాశం వుంది. అయితే, సమాజ - రాజ్యతాత్త్వికతని రచన వస్తువుగాస్వీకరించి పని చేస్తే ముందుగాఅడ్డంకిగా ఎదురొచ్చేవారు సర్కారీకవులు, రచయితలు. తమ నిష్కర్షరచనల ద్వారా, ఉద్యమ సాహితీకార్యక్రమాల ద్వారా వారిని నియంత్రించిముందుకు వెళ్లవలసి వుంటుంది.సర్కారీ కవులు, రచయితలుఉద్యమాలకు భయపడతారు. అవిప్రచండంగా జరుగుతున్నంత కాలంనక్కి నక్కి నడుస్తారు. ఉద్యమాలమధ్య విరామం ఏర్పడే కాలంలో తిరిగివిజృంభిస్తారు. సర్కారీ దన్ను అంతముఖ్యమైన విషయమే కాదన్నట్టుప్రవర్తిస్తారు. నిరాఘాటంగా ఉద్యమాలుకొనసాగించడమే దీనికి సమాధానం.కోవర్టులుఏ ఒక్క రంగానికో పరిమితమైన వారుకాదు, అన్ని రంగాల్లోనూ, అన్ని ముఖాల్తోవున్నారు.ఇంకఅత్యంత శక్తివంతమైనది సినిమామాధ్యమం. దీని పరిస్థితి దారుణంగాతయారైంది. దీని ప్రయోజనాన్ని పక్కదారిపట్టించేశారు సోకాల్డ్‌ మహానటులు,నిర్మాతలు వగైరాలు. సినిమా అన్నదివ్యాపారకళ అన్నారు, యిది వున్నదివినోదం యివ్వడానికే గాని, విజ్ఞానంపంచడానికి, సమాజంలో ఆరోగ్యకరమైనఆలోచనలు రేకెత్తించడానికి, నూత్ననిర్మాణాలు, సంస్కరణల కోసం కాదు అనిబాహాటంగా ప్రకటించారు సినీ పెద్దలు.ప్రేక్షకులు రోజంతా కష్టపడిచూడడానికొస్తారు, వారికి ఆనందం యివ్వాలిగాని, ఏడుపు కాదు అన్నారు. వీరి దృష్టిలోఆనందం అంటే చవకబారు హాస్యం,రెండర్థాల డైలాగులు, మనిషిలోనిబలహీనతల్ని రెచ్చగొట్టి, సెంటిమెంట్లువెదజల్లి, అపార్థాలు కల్పించి డబ్బుచేసుకోవడం - యిదే సినిమా లక్ష్యంఅంటున్నారు యా సినీ పండితులు. ఇటువంటికళా ప్రయోజనాన్ని పెడదారి పట్టించే భావాలుప్రకటిస్తుంటే చీవాట్లు పెట్టడం పోయి ప్రతిసంవత్సరం వారికి ఎవార్డులు యిస్తూపోవడం, సన్మానాలు చెయ్యడం ఆంధ్రలుఅంతులేని విషాదం. దీని వల్ల యివాళసినిమా, సమాజానికి ఏ మాత్రం ఉపయోగంవుండకపోవడమే కాకుండా విలన్‌గాతయారైంది. హేతువాద దృష్టితోతీసుకొచ్చే ఉద్యమాలకు అడ్డుగా నిలుస్తోంది.స్వాతంత్య్ర సమరం సాగే రోజుల్లోసంస్కరణ భావాలు ప్రచారం చేసినసినిమా క్రమంగా, స్వాతంత్య్రంవచ్చాక, ఏం చెయ్యాలో తోచనట్లుజానపదంలోకి, సెంటిమెంట్లలోకి,యిప్పుడు విదేశీ మోజు ప్రభావాల్లోకిదిగజారిపోయింది. ఇదొక ఊబి. నేటి సినీ విషప్రభావం నుంచి యువతరాన్ని బయటకుతీసుకురావడం బహుశా యివాళ ఎవరికీసాధ్యమయ్యే విషయం కాదు.సాంకేతికంగా అభివృద్ధి చెందిందిగాని,విషయపరంగా పతనావస్థలో వుందిసినిమా. ఒకప్పుడు విలన్ల ఆనందం కోసంతక్కువ బట్టల్తో క్లబ్‌ డ్యాన్సులుచేసేవాళ్లు నర్తకీమణులు. ఆసన్నివేశాలు విడిగా వుండేవి. ఇప్పుడుఅటువంటి క్లబ్‌ డ్యాన్సులు విడిగా లేవు. ఆనర్తకీమణుల అవసరమూ లేదు.హీరోయిన్లే మరింత తక్కువ బట్టల్తో,మరింత రెచ్చగొట్టే నాట్య భంగిమల్తోయివాళ డాన్సులు చేస్తున్నారు. అందరూచూడదగ్గ సినిమాలకూ, నీలి చిత్రాలకూమధ్య వుండే తేడా తగ్గిపోయింది.నేటికైపెక్కించే సినీ విష ప్రభావంసామాన్యుడి మీద ఎంతగా వుంటుందో,శాసనాలు చేసి, అమలుపరుస్తూ సంక్షేమరాజ్యం తీసుకురావడానికి ఎన్నుకోబడినరాజకీయ నాయకుల పిల్లలపై కూడా అంతేవుంటుంది. బహుశా అంతకంటే ఎక్కువేవుంటుంది. సినిమాల్లో శృంగార దృశ్యాలుచూసి నరాలు జివ్వుమన్న సామాన్యుడుకాసిని రూపాయలు పెట్టి చీప్‌లిక్కరు, చీప్‌సెక్సు కొనుక్కుంటారు. ఎయిడ్స్‌కిబలైపోతాడు. డబ్బున్నవాళ్ల పిల్లలు,అధికారంలో వున్న వాళ్ల పిల్లలు ఖరీదైనమందు కొట్టి రేప్‌లు చేస్తారు. సెక్సుతోపాటు నేరపూరిత దృశ్యాలతోవుత్తేజితులే తలిదండ్రులు ఇచ్చేవేలకు వేలు పాకెట్‌మనీ వాళ్లహైక్లాస్‌ అలవాట్లకే సరిపోక దొంగతనాలుచేస్తారు. అడ్డమొచ్చిన వారినిహతమారుస్తారు. నేరప్రవృత్తిదినచర్యగా మారుతుంది. ఎప్పుడయినావాళ్లు పోలీసులకు పట్టుబడితే రాజకీయతండ్రులు వాళ్లని విడిపించుకోవడంలోనిమగ్నవుతారు. అంతేగాని,యువతరం ఎంతగా రేపిస్టులుగా,దారుణ నేరాలకి అలవాటు పడుతున్నారోగ్రహించి దీనికి కారణాలను పట్టుకుని, యాదారిలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలుతీసుకోవాలనే దృష్టిని పెట్టరు. రాజకీయనాయకుల అధికార లాలస, పదవీభద్రత, వెంపర్లాట వాళ్లది. విచ్చలవిడి,స్వైర విహారం వాళ్ల పిల్లలది. ఇది యిలాకొనసాగుతూనే వుంటుంది. మొత్తంసమాజం దీనికి బలి అవుతూనే వుంటుంది.సినీమాధ్యమంతో ప్రజల హృదయాల్లోకినేరుగా వెళ్లి ఎంత ఎత్తుకయినాతీసుకెళ్లడానికి అవకాశం వుంది. అలాగేఅధఃపాతాళానికి తొక్కే ప్రమాదమూవుంది. ఒక దేశాన్ని పటిష్టమైన జాతిగామలిచే అవకాశం వుంది. అలాగే నిర్వీర్యంఅయిపోయిన అంచుల్లో వుంది. స్థాయాభేదంతో యిది అన్ని రంగాలకూవర్తిస్తుంది.సాధించినస్వాతంత్య్రం సమాజ పునర్నిర్మాణానికికాలం యిచ్చిన సదవకాశం.ఒకఆదర్శం, లక్ష్యం లేని దేశంక్రమంగా అదృశ్యమవుతుంది. అన్నీవున్నట్లుగానే వుంటాయి. కానీ,క్రమంగా అన్నీ కార్యకలాపాల్నుండిఅదృశ్యమవుతాయి. ఒకానొకభ్రమాజనిత స్థితి ఏర్పడుతుంది.ఉదాహరణకు మన దేశందేశంగానే వుంటుంది. కానీ, దానిని ప్రజలుఎన్నుకున్న ప్రతినిధులు పాలిస్తున్నట్లుకనిపిస్తారు. కానీ వాళ్లు పాలించరు.ప్రభుత్వంలోని కోవర్టులు పరిపాలిస్తూవుంటారు. దేశంలోని వ్యాపార సంస్థలతరఫున, యితర దేశాలఅవసరాలనుగుణంగా పరిపాలిస్తారు.తరువాతమాతృభాష అదృశ్యమవుతుంది. ఆభాష అలాగే వుంటుంది. కార్యకలాపాల్లో దీనిఅవసరం లేకుండా చెయ్యడంజరుగుతూ వుంటుంది.అనంతరంరూపాయి రూపం మారుతుంది. అన్నీ డాలర్‌దృష్టి నుండి చూపబడతాయి. మార్కెట్లోమనిషి ఒక సరుకుగా మార్చబడుతాడు.ప్రపంచ బ్యాంకు, విశ్వ విఫణి వీధివరుచుకుపడి దేశ దేహంలో మిగిలినవాటినన్నింటినీ భోంచేస్తాయి.అందుకే- ఒక ఆదర్శం, లక్ష్యం, స్వాభిమానంలేని దేశం క్రమంగాఅదృశ్యమవుతుంది. కాం వేగంగాగడిచిపోతుంది. ఒకప్పుడు యిక్కడో దేశంవుండేది. బానిస దేశంగా వుండేది. దానిస్వాతంత్య్రం కోసం ప్రజలు యుద్ధంచేశారు. సాధించుకున్నారు. తిరిగిఎన్నుకున్న నాయకుల వల్లస్వాతంత్య్రాన్ని కోల్పోయారు అనిచరిత్రకారులు రాస్తారు.ఇప్పుడువిదేశీయుల మీదనే కాదు, మననాయకుల మీద కూడా ప్రజలు యుద్ధంచెయ్యవలసి వుంటుంది. ఇదే మరోస్వాభిమాన స్వాతంత్య్ర సమరం.అంతర్గత ప్రజా సమరం. తద్వారాఅన్ని విలువలను తిరిగి సాధించుకోవలసినతరుణం ఆసన్నమైంది.

  • రెండుఐడియాల సంఘర్షణ: మూడు డిబేట్లు
  • సాంస్కృతికచెర
  • రెండుతెలంగాణల ఘర్షణ
  • సామాజిక పెట్టుబడి
  • అంతటాక్రీమీలేయర్‌
  • ఎంసెట్‌కుపరిధి ఏది?

  • చిరంజీవికిసూటి ప్రశ్నలు
  • డబ్బురాజకీయాలు
  • ప్రభుత్వాలదుబారా - కర్తవ్యాలు
  • లోక్‌సత్తాకుసాటిలేరెవరు!
  • లక్ష్యాలు - అలక్ష్యాలు
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X