తెలంగాణ వ్యతిరేకమా?

Telangana
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వివాదంగా మారుతున్నది. జగన్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. తెలంగాణలో ఏ పార్టీకి కూడా సభల నిర్వహణకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎలా అనుమతిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అడిగారు. జగన్ ఖమ్మం జిల్లా పర్యటనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రాంతాలకు అతీతంగా తన పట్ల ప్రజలు అభిమానంతో ఉన్నారని చాటుకోవడానికే జగన్ ఖమ్మం జిల్లాను తన యాత్రకు ఎంపిక చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, అది అందుకు భిన్నమైంది. ఖమ్మం జిల్లా కాంగ్రెసు గ్రూపు రాజకీయాల్లో ఇది చోటు చేసుకుంది. జలగం, రేణుకా చౌదరి వర్గీయులు ఈ జిల్లాల్లో ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో మల్లు భట్టివిక్రమార్క వంటి కొత్త నాయకులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ యాత్రను ఏర్పాటు చేశారని అనుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఒక రకంగా జగన్ ఖమ్మం జిల్లా యాత్ర తెలంగాణకు వ్యతిరేకమైందే. ఇతర పార్టీల నాయకులకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎందుకు అనుమతించిందనేది ప్రశ్న. తెలంగాణవాదులను, తెలంగాణ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తూ జగన్ యాత్రకు ఆటంకాలు లేకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయినా, జగన్ యాత్రకు వ్యతిరేకత ఎదరువుతూనే ఉన్నది. అయితే, మీడియా దాన్ని చూపించడం లేదు. మీడియా సీమాంధ్ర ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండడంతో జగన్ కు ఎదురవుతున్న వ్యతిరేకత ఎక్కువగా బయటకు రాదు.

పార్లమెంటులో సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించిన వైయస్ జగన్ కు తెలంగాణలో పర్యటించే అర్హత గానీ తెలంగాణ ప్రజల మేలు చూస్తానని చెప్పే హక్కు గానీ లేదు. తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తాను ఉన్నాననే నమ్మకం కలిగించలేని జగన్ అన్ని ప్రాంతాల నాయకుడు ఎలా అవుతాడనేది పెద్ద ప్రశ్న. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ అదే సమయంలో తెలంగాణ కోసం మరణించిన విద్యార్థుల కుటుంబాలను కూడా సందర్శిస్తే బాగుండేదేమో. నాయకుడెవరైనా అందరినీ సమానంగా చూడాలి. ప్రజలను చీల్చి ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం చూపించే వారు సర్వామోదయోగ్యమైన నాయకుడు కాలేడు. గ్రూపు నాయకుడు మాత్రమే కాగలడు. జగన్ అన్ని ప్రాంతాల నాయకుడు కూడా కాలేడు. తన వల్ల ప్రయోజనం పొందుతున్న ఒక వర్గం, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం అండదండలతో మాత్రమే ఆయన యాత్ర సాగుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+