జూ ఎన్టీఆర్‌పై అవాకులు చవాకులా?

Jr Ntr
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో గురువా రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. వాస్తవాలు తెలియకుండా ఆయన మాట్లాడారు. ఎక్కడో అట్లాంటాలో ఉండే గురువారెడ్డికి ఇక్కడి విషయాలు తెలుస్తాయని అనుకోవడం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, పార్టీకి అండగా నిలుస్తున్న బాలకృష్ణపై గుడ్డి ద్వేషంతో ఆయన విమర్శలు చేశారని నాకు అనిపిస్తోంది. గురువా రెడ్డి వ్యాసాలు నేను మొదటి నుంచీ చూస్తునే ఉన్నాను. ఆయన వైయస్ జగన్‌నూ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీనీ సమర్థిస్తున్నారనే విషయం తెలుస్తూనే ఉంది.

జగన్‌పై అతి ప్రేమ కన్నా చంద్రబాబు నాయుడిపై ఆయన ఎక్కువ ద్వేషం ఉన్నట్లు కనిపిస్తోంది. అందువల్లనే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారాన్ని పెద్దగా చేసి చూపారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆరితేరిన మేధావిలా సలహాలు కూడా ఇచ్చారు. బాలకృష్ణకు ఉన్న ఇమేజ్‌ను, ప్రజాదరణను చూసి, జగన్‌కు అడ్డు వస్తాడనే భయంతో గురువారెడ్డి ఉన్నవీ లేనివి కలిపికొట్టినట్లు కనిపిస్తోంది.

వైయస్ జగన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఏమీ మాట్లాడకుండా చంద్రబాబును ఆడిపోసుకోవడం గురువారెడ్డికి అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. జగన్ అవినీతి ఆరోపణలపై బయటపడిన తర్వాత (ఒక వేళ బయటపడితే) మాట్లాడితే కాస్తా గౌరవంగానూ మర్యాదగానూ ఉంటుందనే విషయం గురువారెడ్డి గుర్తించడం అవసరం.

అయినా, జూనియర్ ఎన్టీఆర్‌కు జగన్ వైపు రావాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. చంద్రబాబుతో, బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌కు విభేదాలు ఉన్నాయనే గురువారెడ్డి ఊహ మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ తమ కన్నా చిన్నవాడు కాబట్టి, తమ కుటుంబ సభ్యుడు కాబట్టి బాలకృష్ణ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఆయనపై కాస్తా కోపంగా ఉంటే ఉండవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ మరీ పట్టుబట్టి కొడాలి నానికి గుడివాడ సీటు ఇప్పించారు. జూనియర్ మాట కాదనలేక చంద్రబాబు ఇచ్చారు. కొడాలి నాని పార్టీని, చంద్రబాబును ధిక్కరించి, వైయస్ జగన్ వైపు వెళ్లారు. కొడాలి నాని అటు వైపు వెళ్లకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నిరోధించలేకపోయారనేది ప్రశ్న. అదే విధంగా, జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడని భావించే తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ నడిరోడ్డు మీద జగన్‌తో మాట్లాడారు. ఇది పార్టీకి నష్టం కాదా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది.

పొగ లేకుండానే నిప్పు ఉందన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపై మీడియా చిలువలు పలువలు రాస్తుంటే, గురువారెడ్డి వంటి వాళ్లు అదే నిజమనుకుని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. అది సరైంది కాదు. గురువారెడ్డి వంటివాళ్లు కాస్తా ముందు వెనకా ఆలోచించి మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం.

- కె. శేషగిరిరావు

(రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. అవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ వ్యాసంపై ఎవరైనా సవివరమైన అభిప్రాయం రాసి పంపితే ప్రచురిస్తాం. అభిప్రాయాలను [email protected] అనే మెయిల్ అడ్రస్‌కు పంపించండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+