• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శాపనార్థాలనే వరాలుగా మారుస్తున్న మోడీ

By Pratap
|

Narendra Modi
తనపైకి విసిరిన రాళ్లనే మెట్లుగా మలిచి సామాజిక ప్రగతికి, పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని మోడీ ఒక్కసారి కాదు, చాలా సార్లు చెప్పడమే కాకుండా చేసి చూపించారు. గత 11 ఏళ్లను వెనక్కి తిరిగి చూస్తే మోడీ వ్యతిరేకులు ఆయనపై ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంత విరుద్ధంగా ఉన్నాయో అర్థమవుతుంది. దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళ మోడీని కోతిగా, ఎలుకగా అభివర్ణించారు. అంతకన్నా దారుణమైన తిట్టు ఉంటుందని అనుకోను. అయినా మోడీ ఎల్లవేళలా మౌనంగానే ఉన్నారు. బుద్ధిలేని మాటలు మోడీ పట్టించుకోలేదు. తన తెలివితేటలను మోడీ గుజరాత్ ప్రశాంతంగా ఉండడానికి, గుజరాత్‌ను శిఖరంగా నిలబెట్టడానికి ఉపయోగించారు.

సోషల్ మీడియాలో కూడా మోడీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చాలా వరకు స్వార్థ శక్తులు వాటిని ప్రోత్సహించాయి. అయినా, ఏ ఒక్క వ్యక్తి ట్విట్టర్‌ను కూడా మోడీ బ్లాక్ చేయలేదు. ప్రస్తుత సమాజంలో ఇటువంటిది చాలా అరుదైన చర్య. ఫేస్‌బుక్‌లో, ఈమెయిల్స్ ద్వారా మోడీపై విమర్శలు కురిశాయి. ఆయన తన దయాగుణాన్ని విడనాడలేదు.

చాలా సందర్భాల్లో మోడీ దయాగుణం బయటపడుతూ వచ్చింది. ఇద్దరు యువకులను నేను మరిచిపోలేను. ఈ ఇద్దరి పట్ల వ్యవహరించిన పద్ధతి మోడీ ముస్లిం యువకుల పట్ల చూపే కరుణకు అద్దం పడుతాయి. 2002, 2006ల్లో మోడీకి బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపించారు. ఈ మెయిల్స్ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా వారి పట్ల మోడీ చాలా దయాగుణం ప్రదర్శించారు. ఏ ఎవరైనా కపిల్ సిబాల్‌పై లేదా ఆయన మాస్టర్లపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే వారు ఎలా స్పందిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్నపాటి రెచ్చగొట్టే పద్ధతుల వల్ల మనోభావాలు దెబ్బ తినే గడ్డ మీద ఆ ఇద్దరు యువకులు మోడీ ప్రవర్తన వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు.

మొదటి సంఘటన 2002 నాటిది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది మాత్రమే అవుతోంది. అస్థిరమైన రాజకీయాలతో సతమవుతున్న రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పెట్టాల్సిన కఠినమైన లక్ష్యం ముందుంది. నిరంతరంగా దాడి చేసే మీడియా ఏ మాత్రం సహాయపడే స్థితిలో లేదు. ఇటువంటి సమయంలో ముంబైకి చెందిన 30 ఏళ్ల రజాక్ నసీర్ ఖాసీం అనే యువకుడు మోడీని చంపుతానని బెదిరిస్తూ ఈ మెయిల్ పంపించాడు. దాంతో ఖాసిం తీవ్ర పరిణామాలను ఎదుర్కున్నాడు.

ఐటి కంపెనీలో చేస్తున్న ఉద్యోగం ఊడింది. ఐటి యాక్టులోని వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. ఖాసింను జ్యుడిషియల్ కస్టడీకి పంపిన 15 రోజుల తర్వాత మోడీ జోక్యం చేసుకున్నారు. ఇది తెలిసిన తర్వాత మోడీ అతి కొద్ది మంది మాత్రమే చేసే పనిని ఆయన చేశారు. ఆ యువకుడ్ని క్షమించాలని నిర్ణయించుకున్నారు. ఆ యువకుడి రికార్డును, విద్యాభ్యాసాన్ని చూశాడు. నేర చరిత్ర లేదు. అనవసర ఉద్వేగం కారణంగా ఆ యువకుడు ఆ పనిచేశాడని మోడీ అర్థం చేసుకున్నారు. ఖాసిం తల్లిదండ్రులను, తాతతాతమ్మలను, ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి, ఖాసింను క్షమిస్తున్నట్లు చెప్పారు. కేసులన్నీ ఉపసంహరించుకున్నారు. అంతటితో వదలలేదు. రజాక్ ఖాసింకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఐటి కంపెనీని కోరారు. ఇది మోడీ నిబద్ధతకు అద్దం పడుతుంది.

ఖాసిం తన తప్పును అర్థం చేసుకున్నాడు. వాస్తవాలను తెలుసుకోకుండా ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోనని చెప్పాడు. మోడీ అలా చేయకపోతే, ఖాసిం ఐదేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చేది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చేది. మోడీ పాలనాదక్షుడి లక్షణం ఓ ముస్లిం యువకుడి జీవితాన్ని కాపాడింది.

మరో సంఘటన 2006లో జరిగింది. మోడీని దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ జనవరిలో ఒమర్ ఫరూఖ్ సిద్దిఖి అనే ముస్లిం యువకుడు ఢిల్లీ నుంచి మెయిల్ పంపించాడు. మోడీ అతన్ని క్షమించి వదిలేశాడు. దాంతో అతని జీవితం, కెరీర్ దెబ్బ తినకుండా చూశారు.

మోడీ నుంచి ప్రజా జీవితంలో ఉండేవారు చాలా నేర్చుకోవాలని ఆశిస్తాం. స్వార్థ శక్తులు మోడీపై తీవ్రమైన విమర్శలు చేశాయి. అయినా మోడీ చలించలేదు. పైగా, గాందీ దయాగుణాన్ని సొంతం చేసుకున్నారు, గుజరాత్‌ను అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా సాగుతూ వాటిని మరిచిపోయారు.

- కిశోర్ త్రివేది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When people throw stones at me, I convert the stones into a flight of stairs, a staircase of growth and progress of society- this is what Narendra Modi has said not once but often. Look back at the past eleven years and the words that have come out from the mouths of the various Modi baiters are intense and extremely unbecoming for a democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more