వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ లాగే బరాక్ ఒబామా

By Pratap
|
Google Oneindia TeluguNews

ఈ ఉదయం అమెరికా అధ్యక్షుడు ఒబామా స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగాన్ని ఆనందిస్తున్నప్పుడు నా ఆలోచనలు కాస్తా వెనక్కి వెళ్లాయి. (నా అభిమాన వక్తల్లో ఒబామా ఒకరు). మరో చురుకైన రాజకీయ వేత్త ఓ వారం రోజుల క్రితం అదే విషయంపై చేసిన ప్రసంగం వైపు వెళ్లకుండా నా మనసును నిలువరించలేకపోయాను. ఒబామా ఏం మాట్లాడారో అచ్చంగా వారం క్రితం ఆ నేత మాట్లాడారు. ఆ నేత ఎవరో కాదు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.

ఒబామా మాటలు వింటున్నప్పుడు నేను క్రిక్కిరిసిన ఎస్ఆర్‌సిసి ఆడిటోరియంలో లేదా వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మోడీ ప్రసంగాన్ని వింటున్న అనుభూతికి లోనయ్యాను. ప్రపంచంలోని రాజకీయ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం భిన్నమైన గొంతులతో మాట్లాడవచ్చు. కానీ, అభివృద్ధి చెందిన దేశంలోనైనా, అభివృద్ధి చెందుతున్న దేశంలోనైనా పాలనాదక్షుడి మాటలు స్థిరంగా ఉంటాయి. మోడీ ప్రసంగంలో మాదిరిగానే ఒబామా మాటల్లో ఓ ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ప్రసంగం ముందుకు సాగడం గురించి, సమాజంలోని అన్ని సెక్షన్లను ముందుకు నడిపించడంపై సాగింది.

అదంతా అర్థికమే..

జార్జి బుష్ సీనియర్‌ను శ్వేతసౌధం నుంచి పంపించి వేయడానికి గతంలో బిల్ క్లింటన్ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ రోజు కూడా ముందు చూపు గల రాజకీయవేత్త ప్రాపంచికమైన రాజకీయ అంశాలపై కన్నా ఎక్కువగా ప్రజలు వినడానికి ఇష్టపడే ప్రస్తుత అభివృద్ధి దృక్కోణం గురించి మాట్లాడుతాడు. ఇప్పటి ప్రజలకు, ముఖ్యంగా యువతకు మోతీలాల్ వోరా నేలపై పడుకున్నాడనే విషయం లేదా మబ్బుల 4 గంటలకు ఆకాశం చీకటిగా ఉందనే విషయమో అవసరం లేదు. వెలిగిపోవడానికి అవసరమైన ఉద్యోగాలు, అవకాశాలు వారికి కావాలి.

ఒబామా ఇలా చెప్పారు - "మన ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాలను కల్పిస్తుంది. కానీ చాలా మంది ఇంకా పూర్తి స్థాయి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.... అమెరికాను కొత్త ఉపాధి, ఉత్పత్రి అయస్కాంతంలా అమెరికాను తయారు చేయడమే మా ప్రథమ ప్రాధాన్యం". ఒబామా చెప్పిన విషయాలతో మోడీ దృష్టి కోణానికి మధ్య తేడా ఏమీ లేదు. గుజరాత్‌ను మోడీ ఉద్యోగావకాశాలను సృష్టించే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దేశంలోని ఉద్యోగావకాశాల్లో 72 శాతం గుజరాత్ కల్పిస్తోంది. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం గుజరాత్.

అమెరికా అవుట్ సోర్సింగ్ వంటి సమస్యలతో సతమవుతున్న తరుణంలో జీవనోపాధి కోసం వచ్చే పిల్లలకు ఉపాధి కల్పించడానికి ప్రదేశాల్లో ఇండియాలో గుజరాత్ సిద్ధంగా ఉందని - ఆ జీవనోపాధి శాంతితో గౌరవప్రదమైందని ఒక అడుగు ముందుకేసి మోడీ చెప్పారు.

Narendra Modi-Barack Obama

ఉత్పత్తి, ఆవిష్కరణలు, ఉత్పత్తి ఆవిష్కర్తలు

ఉత్పత్తి రంగాన్ని తిరిగి ప్రోత్సహించడమనేది ఒబామా ప్రసంగంలో కీలకమైన విషయం. జపాన్ నుంచి గొంగళిపురుగు తిరిగి ఉద్యోగాలను ఎలా తెస్తుందీ, ఇంటెల్ ఎలా ప్లాంట్స్ తెరుస్తోందీ, అమెరికాలో ఆపిల్ మ్యాక్స్ ఎలా చేస్తుందీ, అమెరికన్లు ఐదేళ్ల క్రితం నాటి కన్నా ఇప్పుడు అమెరికా కార్లనే ఎక్కువగా ఎలా కొంటున్నదీ - ఒబామా వివరించారు. ఈ విషయాలు ఉత్పత్తి రంగాన్ని అబివృద్ధి చేయాల్సిన దృష్టి కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఇది 21వ శతాబ్దం అవసరం.

2013 గుజరాత్ సదస్సులో నరేంద్ర మోడీ ఈ విషయాలే చెప్పారు. ఆయన జీరో డిఫెక్స్ మంత్రాన్ని ఉపదేశించారు. ఉత్పత్త రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశ ప్రయోజనాలను కేంద్రం విదేశీయులకు అమ్మడానికి సిద్ధపడిన వేళ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ గురించి మాట్లాడుతున్న ఒకే ఒక వర్తమాన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ.

గత కొన్నేళ్లుగా నూతన ఆవిష్కరణల గురించి మోడీ మాట్లాడుతుండడాన్ని మనం గుర్తించాలి. నూతన ఆవిష్కరణలతో, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, తద్వారా గుజరాత్‌ను అభివృద్ధి పథంలో మరింత వేగంగా తీసుకుపోవడానికి వీలవుతుందని ఆయన యువతకు చెబుతూ వస్తున్నారు. యువత కోసం ఇంకుబేషన్ సెంటర్ అయిన ఐక్రియేట్‌ ఆయన 2011 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. యువత కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే స్వప్నాలను వాస్తవం చేయడానికి గుజరాత్ ముందుకు వస్తుందనే సందేశాన్ని ఆయన అందించారు.

తన ప్రసంగంలో ఒబామా అదే విషయం చెప్పారు. వినూత్న ఆవిష్కరణలు ఉత్పత్తి రంగం పటిష్టతకు చోదకశక్తిగా పనిచేస్తాయని ఒబామా చెప్పారు. ప్రభుత్వం ఓహ్యోలో తొలిసారి మ్యానుఫాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించిన విషయాన్ని ఒబామా గుర్తు చేశారు. మిగతా నగరాల్లో కూడా ఇటువంటి రావాలని ఆశించారు.

మధ్యతరగతి, వారి ఆకాంక్ష గురించి ఒబామా

రాజకీయం నువ్వేం చేస్తున్నావో కాకుండా మై బాప్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న చోట, ముత్తాత పేరు ప్రాముఖ్యమైన చోట దాన్ని బద్దలు కొట్టిన నేత నరేంద్ర మోడీ. 2012 శాసనసభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ నూతన మధ్య తరగతి గురించి మాట్లాడారు. ఈ వర్గం గురించి మాట్లాడిన మొదటి రాజకీయ నాయకుడు మోడీయే. వారి బాగోగుల గురించి ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ అంటూ ప్రశాంతంగా మాట్లాడుతూ ఇతర విషయాలకు ప్రాముఖ్యం లేని సంప్రదాయబద్దమైన రాజకీయ చాతుర్యాన్ని ఆ రకంగా మోడీ సవాల్ చేశారు. ఈ భవిష్యత్తు దృష్టికోణం గల వైఖరి వాస్తవికత పునాదుల్లో పనిచేసింది. ఎన్నికల్లో మోడీకి చాలా కలిసి వచ్చింది.

అదే పంథాలో, బలమైన మధ్య తరగతిని సృష్టించాల్సిన అవసరం గురించి ఒబామా మాట్లాడారు. "ఇది మన తరం లక్ష్యం, అప్పుడు, అమెరికా ఆర్థిక పెరుగుదలకు సంబంధించిన అసలు యంత్రాన్ని నడిపించదలిచినప్పుడు - ఎగిసిపడుతున్న, ఉత్సాహం చూపుతున్న మధ్య తరగతి కావాలి" అని అన్నారు. అభివృద్ధికరమైన సమాజానికి మధ్యతరగతి అవసరం గురించి ఇద్దరు నాయకులు గుర్తించారు. మధ్య తరగతి అసంతృప్తితో ఉంటే ఏ సమాజం కూడా ముందుకు సాగదు.

పచ్చదనం గూరిచంి మాట్లాడారు

ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ), బిటి (బయో టెక్నాలజీ), ఇటి (ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ) - అనే మూడు స్తంభాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మోడీ పలు సందర్భాల్లో చెప్పారు. బీజింగ్‌తో పాటు ప్రపంచంలోని పలు నగరాలు పర్యావరణ సమస్యను ఎదుర్కుంటున్న సమయంలో గుజరాత్‌లో మోడీ వాతావరణ మార్పులను తగ్గించే చర్యలకు పునాదులు వేశారు.

మన కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం వాతావరణ మార్పులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని మోడీ నమ్ముతారు. క్లైమేట్ చేంజ్‌పై ప్రత్యేకమైన శాఖ ఉన్న ప్రపంచంలోని నాలుగు రాష్ట్రాల్లో గుజరాత్ ఒక్కటి కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. రెనెవెబుల్ ఎనర్జీకి సంబంధించిన అన్ని రూపాలు గుజరాత్ అనుభవంలోకి వచ్చాయి. జీవనానికి యోగ్యమైన ప్రపంచాన్ని ఎలా రూపొందించవచ్చో గజురాత్ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మోడీ రాసిన "కన్వీనియెంట్ యాక్షన్" అనే పుస్తకం తెలియజేస్తుంది. ఆనందకరమైన భవిష్యత్తు కోసం మోడీ సౌకర్యవంతమైన చర్యను సూచించారు.

మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు అవసరమైన వాతావరణ మార్పుల గురించి ఒబామా మాట్లాడారు. అందుకు సోలార్, విండ్ పవర్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి చెప్పారు. చరంకాలో ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పార్కును జాతికి అంకితం చేసిన సందర్భంలో గానీ, వన మహోత్సవాల్లో గానీ మోడీ చేసిన ప్రసంగాలు నాకు గుర్తుకు వచ్చాయి.

యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం..

మరో విషయాన్ని కూడా ఒబామా అందంగా మన ముందు పెట్టారు. ఉత్పత్తి, ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాల్లో పలు ఆవిష్కరణలను ముందుకు తేవచ్చు, కానీ పౌరులకు నైపుణ్యం, శిక్షణ ఉంటే తప్ప ముందుకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాదని ఆయన అన్నారు. దాన్ని సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని అన్నారు.

యువతలో అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి గుజరాత్ తీసుకుంటున్న చర్యలను ఎస్ఆర్‌సిసిలో ప్రసంగంలో చాలా సుదీర్ఘంగా వివరించారు. ఏ ప్రభుత్వ విధానపరమైన సంస్థ లేదా బి - స్కూల్లో కేస్ స్టడీకి పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటిఐలను) మార్పు చేయడంలో ఏ ప్రభుత్వమైనా చొరవ చూపాలి. ఒబామా ఇలా చెప్పారు - "మంచి పనిక మన పిల్లలను హైస్కూల్ డిప్లమా మార్గంలో పెట్టే విదంగా చూడాలి". ఏ యువకుడికి కూడా అవకాశాలు మూసుకుని పోకూడదనే ఉద్దేశంతో ఐటిఐలకు మోడీ కొత్త రూపం ఇచ్చారు. ఒకేసారి ఒకేవారంలో యువతకు 65 వేల ఉద్యోగాలకు లేఖలు ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించారు

అమెరికాలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి గురించి ఒబామా మాట్లాడారు. ఇది అత్యంత ఆక్షేపణీయం. యువతలో నిరుద్యోగం పెరగడం, అవకాశాలు లోపించడం వల్ల అది విస్తరిస్తోంది. ఉద్యోగాలు లేక చీకటి అలుముకుంటున్న వేళ నిరాశావాదం ఆవహించిన వాతావరణం సమాజంలో అల్లర్లకు దారి తీస్తుంది. ఎస్ఆర్‌సిసి ప్రసంగంలో ఈ సామాజిక సమస్యకు మోడీ పరిష్కారం సూచించారు. అన్ని సమస్యలకు అభివృద్ధి - కేవలం అభివృద్ధి మాత్రమే పరిష్కారమని ఆయన స్పష్టంగా చెప్పారు

మోడీ గూగుల్ ప్లస్ నిరుడు ఆగస్టులో హ్యాంగ్ అవుట్ సమయంలో మీడియా మోడీ డస్ యాన్ ఒబామా అనే కథనాలతో మీడియా ప్రచారం చేయడం సాగించింది. మోడీ హ్యాంగ్ అవుట్ వినూత్న చర్య. వారానికి 555,000 వ్యూస్ వస్తున్నాయి. (సెషన్ ప్రారంభమైన తర్వాత 7 నెలల్లో ఒబామా హ్యాంగ్ అవుట్ 712,000 మంది వీక్షకులు). మోడీ సమగ్రమైన ఎస్ఆర్‌సిసి ప్రసంగం, ఒబామా స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగం విన్న తర్వాత వచ్చే కాలంలో ఆయన విధానాల గొంతును తెలియజేసింది. ఒబామా మోడీలాగేనని నేను కచ్చితంగా చెప్పగలుగుతున్నాను.

ఒబామా చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు

1. మనకు పెద్ద ప్రభుత్వం అవసరం లేదు. కానీ విస్తృత ప్రాతిపదిక పెరుగుదలకు ప్రాధాన్యతలను, పెట్టుబడులను నిర్దేశించే మంచి ప్రభుత్వం కావాలి.

2. అమెరికాను ఉద్యోగాలకు, ఉత్పత్తికి ఆకర్షణీయమైన దేశంగా రూపొందించడానికే మా ప్రథమ ప్రాధాన్యం.

3. అమెరికా ఆర్థిక పెరుగుదల - ఎదుగుతున్న, అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతికి చెందిన అసలైన యంత్రాన్ని తిరిగి నడిపించడమే.

మోడీ చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు

1. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలనను నేను విశ్వసిస్తాను

2. ప్రపంచాన్ని మన మార్కెట్‌గా మార్చుకుందాం, ప్రపంచానికి సరుకులు పంపుదాం

3. జగద్గురు భారత్ అనే స్వామి వివేకాంద స్వప్నాన్ని భారత యువత సాకారం చేయగలదనే నమ్మకం ఉంది.

- కిశోర్ త్రివేది

English summary
Kishore Trivedi wrote - This morning, while I was enjoying President Obama deliver his State of the Union address (I must confess he is among my favourite orators), I got a sense of deja vu. My mind could not help but go back to the speech of another dynamic politician who had just a week ago touched upon the same issues that Obama did and even delivered on most of what Obama only spoke- that leader is none other than Gujarat CM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X