వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: మెడిసిన్స్ వేసుకుంటున్నారా? అయితే ఈ పదార్ధాలు అసలు తీసుకోవద్దు..వెరీ డేంజర్!!

|
Google Oneindia TeluguNews

అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారు, మందుల వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనారోగ్యానికి సంబంధించిన మందులను రాసినప్పుడు, డాక్టర్ తీసుకోవాల్సిన ఆహారాన్ని, తీసుకోవాల్సిన సమయాన్ని కూడా సూచిస్తారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని కూడా సలహా ఇస్తారు. అయితే సహజంగా మనకు తెలియకుండానే చాలామంది మందులు వేసుకునే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను, ద్రవరూప పానీయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

health tips: ఉదయం ఖాళీకడుపుతో ఈ పదార్ధాలు తింటున్నారా? అయితే అనారోగ్యం తెచ్చుకున్నట్టే!!health tips: ఉదయం ఖాళీకడుపుతో ఈ పదార్ధాలు తింటున్నారా? అయితే అనారోగ్యం తెచ్చుకున్నట్టే!!

మందులతో పాటు కొన్ని రకాల ఆహారపదార్ధాలు పొరబాటున కూడా తీసుకోకండి

మందులతో పాటు కొన్ని రకాల ఆహారపదార్ధాలు పొరబాటున కూడా తీసుకోకండి

మందులు వేసుకోవడానికి ముందు కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే అది ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని చేకూరుస్తుంది. మందులతోపాటు వీటిని తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు, దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. కొన్ని ఆహార పదార్థాలు మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే వాటిని మందులతో పొరపాటున తీసుకోకూడదని చెబుతుంటారు. మందులతో పాటుగా తీసుకోకూడని కొన్ని పదార్థాల వివరాల్లోకి వెళితే

 ఎనర్జీ డ్రింక్స్, మద్యం సేవించి మెడిసిన్స్ వేసుకోవచ్చా?

ఎనర్జీ డ్రింక్స్, మద్యం సేవించి మెడిసిన్స్ వేసుకోవచ్చా?


కొంతమంది ఎనర్జీ డ్రింక్ తాగుతూ ఉంటారు. మందులు వేసుకోవాల్సిన వాళ్ళు ఎనర్జీ డ్రింక్స్‌తో పాటు మందులు తీసుకోకూడదు. ఇది మీ శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది ఆల్కహాల్ తీసుకొని ఆపై మందులను కూడా వేసుకుంటూ ఉంటారు. మందులతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం మీ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది . మీ ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ తో పాటు మందులను కలిపి తీసుకోవడం కాలేయానికి హాని చేస్తుంది. ఇతర కాలేయ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది.

ధూమపానం చేసిన తరువాత మెడిసిన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

ధూమపానం చేసిన తరువాత మెడిసిన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది?


ధూమపానం హానికరమని చెప్పినప్పటికీ చాలామందికి ధూమపానం ఒక వ్యసనంగా ఉంటుంది. ఇక అటువంటి వారు కొందరు సిగరెట్లు తాగి, ఆ తర్వాత మందులు వేసుకుంటూ ఉంటారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతింటాయి. ధూమపానం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, తద్వారా మీరు వ్యాధుల బారిన పడవచ్చు. ఇక ధూమపానం చేసిన తర్వాత మందులు ఉపయోగించడం మందుల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తుందని చెబుతున్నారు.

 మందులు వేసుకునేందుకు పాల ఉత్పత్తులను తీసుకోవచ్చా?

మందులు వేసుకునేందుకు పాల ఉత్పత్తులను తీసుకోవచ్చా?


పాల ఉత్పత్తులు మీ శరీరంలో కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా పని చెయ్యనివ్వకుండా చేస్తాయి. పాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కేసైన్ ప్రొటీన్‌తో కలిసి ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఆ సమయంలో పాలు తాగకూడదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు- ఆ మందులు వాడే వారికి మంచిది కాదు

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు- ఆ మందులు వాడే వారికి మంచిది కాదు


రక్తపోటును తగ్గించడానికి తీసుకునే మందులు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ పొటాషియంను అందిస్తాయి. శరీరంలో ఏదైనా అధికంగా ఉంటే అది హానికరం అని చెప్పబడింది. బీపీ ఉన్నవారు తీసుకునే మందుల వల్ల వారికి పొటాషియం అధికంగా ఉంటుంది. తద్వారా వారు గుండె మరియు రక్త ప్రసరణలో సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్నవారు బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చిలగడదుంపలు, బంగాళదుంపలు మొదలైన పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటే మంచిది అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

 కొన్ని మందులకు ఆకు కూరలు మంచిది కాదు

కొన్ని మందులకు ఆకు కూరలు మంచిది కాదు

ఆకు కూరలు అందరూ మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని మందులు ఉపయోగించే వారికి ఆకుకూరలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు రక్త స్రావం, రక్తం గడ్డ కట్టడం వంటి ఇతర సమస్యలకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ వినియోగానికి, ప్రభావానికి ఆటంకం కలిగిస్తాయి. కాలే, బ్రోకలీ మొదలైన ఆకుకూరలలో విటమిన్ కె ఉంటుంది. విటమిన్ కె అధికంగా తీసుకోవడం వార్ఫరిన్ వంటి మందుల ప్రభావాలకు ఆటంకం కలిగిస్తుంది. వార్ఫరిన్ తరచుగా రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం లేదా ఇతర రక్త రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆకుకూరలు తీసుకోవడం మంచిది కాదని సూచించబడింది.

మెడిసిన్స్ వైద్యుల సూచన ప్రకారం వేసుకోవాలి

మెడిసిన్స్ వైద్యుల సూచన ప్రకారం వేసుకోవాలి


వైద్యుడి దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్న తర్వాత, వైద్యులు ఇచ్చే సూచనలను పాటించాలి. ఒకవేళ వైద్యులు ఆహారనియమాలు చెప్పకపోతే, అడిగి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ప్రతి రోజు మందులు వాడుతున్నవారు, ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఆ మెడిసిన్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Are you taking medicines? But medical experts say that consuming alcohol, energy drinks, smoking and dairy products are very dangerous when you are using medicines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X