దేశంలో రేప్ క్యాపిటల్ గా జోధ్ పూర్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువ అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జనాభా ప్రాతిపదికన అత్యాచార ఘటనలను పరిగణలోకి తీసుకుంటే.. ఢిల్లీ కంటే రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఈ విషయంలో ముందున్నట్లు ఇండియా స్పెండ్ సర్వే వెల్లడించింది.
సగటున లక్షమంది జనాభాను పరిగణలోకి తీసుకుంటే.. జోద్ పూర్ లోనే ఎక్కువ రేప్ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లుగా సర్వేలో తేలింది. ఢిల్లీతో పోల్చితే జోధ్ పూర్ లో అత్యాచారాల సగటు ఎక్కువగా ఉండడం గమనార్హం. 2015 లో నమోదైన నేర గణాంకాల ప్రకారం ఢిల్లీలో 1893 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
అంటే.. సగటును ప్రతీ రోజు ఢిల్లీలో ఏదో ఒక చోట ఐదు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీతో పోల్చితే ఈ సగటు విషయంలో జోధ్ పూర్ లోనే ఎక్కువ సగటు నమోదైంది. జోధ్ పూర్ తర్వాత రాయ్‌పూర్ మూడోస్థానంలో ఉందని పేర్కొంది. అలాగే 2014 నేర లెక్కల ప్రకారం.. గ్వాలియర్ నగరం అత్యాచార ఘటనల్లో ముందు ఉన్నట్లు సర్వే తెలిపింది.

అయితే అత్యాచార కేసులు మాత్రం గ్వాలియర్ కంటే ఢిల్లీలోనే ఎక్కువగా నమోదవడం గమనార్హం. 2012ల దేశవ్యాప్తంగా తీవ్ర చర్చను లేవనెత్తిన నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఢిల్లీలో ఈ పరిస్థితిలో మార్పు రాకపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో అత్యాచార ఘటనలు మూడింతలు పెరిగాయని సర్వే వెల్లడించింది. రేప్ లను అరికట్టడంలో ప్రభుత్వ సంప్కరణలు పూర్తిగా విఫలమైనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని సర్వే తెలియజేసింది.
2015 లో-.. ఢిల్లీ 80 జైపూర్ 21 ఫరీదాబాద్ 16 ముంబై 14 గ్వాలియర్ 13 సామూహిక అత్యాచార కేసులు నమోదయ్యాయి.
ఇక అదే 2015లో.. ఢిల్లీ 1,893, ముంబై 712, జైపూర్ 279 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అత్యాచార యత్నాల విషయానికొస్తే.. ఢిల్లీ39 పాట్నా23 మీరట్21 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications