వజ్రాలగని ఆంధ్రావని
హైదరాబాద్‌ః మొగలాయి కళ, రాజస్ధానీ పనితనం ప్రతిబింబించే తేవా ఆభరణాల, వస్తువుల ఎగ్జిబిషన్ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్ కృష్ణా ఇంటర్నేషనల్ లో జరుగుతుంది. తేవా కళ నాలుగు వందల ఏళ్ళ నాటిది. రాజస్ధాన్ లో ఒక తెగకు చెందిన వారు ఈ ఆభరణాలను తయారుచేసేవారు. అంతరించిపోతున్న ఈ కళను ఇప్పుడు ఆ తెగకు చెందిన ఒక కుటుంబం కొనసాగిస్తూ వస్తున్నది. ఈ కళాకారులు కళలోని మర్మాన్ని పొరపాటున కూడా ఎవరికీ చెప్పారు. రూపా వోరా గనుక ఈ కళ గురించి చదివి ఉండకపోతే దానికి ఇప్పటికే అంత్యక్రియలు జరిగి ఉండేవి. వృత్తి రీత్యా గ్లాస్ ఆర్టిస్టు, ఫ్యాషన్ డిజైనర్ అయిన దీపా వోరా రాజస్ధాన్ లోని ఒక కుగ్రామంలో తేవా ఆభరణాలు తయారు చేసే కళాకారుల కుటుంబం ఒకటుందని తెలుసుకుని, అక్కడికెళ్ళి వాళ్ళను ఒప్పించి ఈ కళను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. తమ కళా రహస్యాలను అత్యంత గుట్టుగా ఉంచుకునే వీళ్ళు తేవా గిరిజన తెగలో గౌరవ సభ్యత్వం తీసుకున్న తర్వాత దీపా వోరాతో కళా రహస్యాలను పంచుకున్నారు.












Click it and Unblock the Notifications