వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో ఇంటిపోరు

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రపంచ మేటి ఆటగాడిగా కీర్తి కిరీటం ధరించిన సచిన్‌ టెండూల్కర్‌ ఒక్కసారిగా వెనకబడిపోయాడు. ఆస్ట్రేలియాపై సచిన్‌ ఆట తీరు అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆయన అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ ఇదే. రాహుల్‌ ద్రావిడ్‌, వివియస్‌ లక్ష్మణ్‌ ఆస్ట్రేలియాపై ఆడిన తీరు వారిని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలబెట్టాయి. ఈ స్థితిలో సచిన్‌ టెండూల్కర్‌ దాదాపుగా ఫేడవుట్‌ అయ్యే వాతావరణం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాపై రెండో టెస్టు విజయంలో టెండూల్కర్‌ పాత్ర నామమాత్రమే. ఈ స్థితిలో ఆస్ట్రేలియా పత్రికలు టెండూల్కర్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ రకంగా అతని నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసే పనిలో అవి పడిపోయాయని కూడా చెప్పవచ్చు.

నిరుడు భారత్‌ ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో కూడా సచిన్‌ పెద్దగా రాణించలేదు. నిరుడు భారత్‌ ఐదు టెస్టులు మాత్రమే ఆడింది.వీటిలో సైచిన్‌ స్కోర్లు 8, 51, 9, 32, 8, 7, 55, 1, 0, 37. ఈ స్కోర్లను బట్టి టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్‌ ఎంత పేలవమైన ఆట ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై జరిగిన మొదటి రెండు టెస్టుల్లో సచిన్‌ సాధించిన మొత్తం స్కోరు 38 పరుగులే. అతను ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ కాగా మూడో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. బ్రిస్బేన్‌ టెస్టులో అతని ఎల్‌డిడబ్ల్యు పూర్తిగా అంపైర్‌ పొరపాటే. అయితే సచిన్‌లో పూర్తిగా చేవ చచ్చినట్లేనా? అలా అనుకోవడానికి లేదు. వన్డేల్లో సచిన్‌ పరుగుల వరదకు కొరతకు లేదు. టెస్టు మ్యాచ్‌ల్లోనే అతను విఫలమవుతున్నాడు. సచిన్‌ బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలు లేకపోలేదు. ఆఫ్‌ స్టంప్‌ను రక్షించుకునే విషయంలో అతను వెనకడుగు వేస్తున్నాడు. అతని బ్యాక్‌ఫుట్‌ లెగ్‌స్టంప్‌ అవతలికి పోతోంది. ఆఫ్‌స్టంప్‌ నుంచి పక్కకు తప్పుకోకుండా ఆఫ్‌సైడ్‌ షాట్లు కొట్టేందుకు ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. అలా ఆఫ్‌స్టంప్‌ను రక్షించుకునే ప్రయత్నం చేయకపోతే ప్రమాదం తెచ్చి పెడుతోంది. ఈ సాంకేతిక లోపాలను సచిన్‌ గుర్తించి వుండడా అనేది సందేహం. ఈ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో అతను తప్పకుండా ఉంటాడు.

ఇదే సమయంలో మరో విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 1973లో జన్మించిన సచిన్‌ 30 ఏళ్ల వయస్సు దాటాడు. ఈ స్థితిలో గత దూకుడుకు స్వస్తి చెప్పి స్థిరమైన ఆట ఆడే ప్రయత్నంలో అతను ఉన్నాడని అనుకోవాలి. ఆ ప్రయత్నంలోనే అతను కొన్ని లోపాలు చేస్తూ ఉండవచ్చు. గతంలో ద్రావిడ్‌, లక్ష్మణ్‌లు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కున్నారు. వీరిద్దరూ పరుగులు చేయకుండా వికెట్ల వద్ద ఎంత సేపయినా నిల్చోగలరు. అంటే ఒక రకమైన జిడ్డు ఆటను ప్రదర్శించదల్చుకుంటే వీరిని అవుట్‌ చేయడం కనాకష్టమే. కానీ వన్డే మ్యాచ్‌ల్లో ఇది పనికి రాదు. టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఏ బ్యాట్స్‌మన్‌కైనా పరుగులు చేయాల్సిన ఆగత్యం ఉండి తీరుతుంది. ఈ క్రమంలో వారిరువురు తమ బ్యాటింగ్‌కు పదును పెట్టుకున్నారు. షాట్ల ఎంపికలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. వీరు షాట్లు కొట్టాలనుకుంటే గతంలో బంతి లేచి క్యాచ్‌ వెళ్లేది. ఇప్పుడా స్థితిని వీరు అధిగమించారు. అందువల్లనే వీరిద్దరు రాణించగలుగుతున్నారు. ఈ నైపుణ్యాన్ని సాధించే క్రమంలో సచిన్‌ ఇప్పుడున్నాడు. అందువల్ల సచిన్‌ పని అయిపోయిందని అనుకోవడానికి లేదు. మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే మూడో టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ కాస్తా మెరుగనిపించుకున్నాడు. బ్రియాన్‌ లారా పడి లేచిన కెరటమే! సచిన్‌ టెండూల్కర్‌ కూడా పడి లేచే కెరటమేనని ఆశింవచ్చునేమో!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X