బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి

ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలలోకి వెళుతున్నారు. ఇక తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ వైపు చూసిన గుండు సుధారాణి
గత కొద్దిరోజులుగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ సభకు గుండు సుధారాణి డుమ్మా కొట్టారు. కేటీఆర్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో ఎక్కడ కనిపించలేదు.

Big shock for BRS greater warangal mayor Gundu Sudharani joined in Congress

జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుండు సుధారాణి
గత కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కూడా గుండు సుధారాణి కలిసి మాట్లాడారు. ఇక ఈ పరిణామాలన్నీ ఆమె కాంగ్రెస్ బాట పడుతున్నారు అన్న అంశాన్ని బలపరిచాయి. ఇక ఈ రోజు ఊహించని విధంగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గారెడ్డి మరియు కోదండ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్
ఇది ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్న గుండు సుధారాణిని కొండా సురేఖ దంపతులు రాకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం . ఒకవేళ కొండా సురేఖ దంపతులతో సఖ్యత ఉన్నట్లయితే గుండు సుధారాణి వారి సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకునేవారు.

వరంగల్ జిల్లాలో కుదేలవుతున్న బీఆర్ఎస్
కానీ అటువంటి పరిస్థితి లేకపోవడంతో నేడు ఆమె జగ్గారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి, గుండు సుధారాణి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా కొడుతున్న దెబ్బలతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతోంది. మరి ఈ పరిణామాలు కొంత జీర్ణించుకోవడానికి కెసిఆర్ కు కష్టమే అయినప్పటికీ, తప్పని పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+