ఈసారి అక్షయ తృతీయ నాడే బోలెడు శుభయోగాలు.. ఇలా చేసినవారికి ధనయోగం
అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు. అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించే రోజు. అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. ఇటువంటి అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే నెలలో 10వతేదీన శుక్రవారం నాడు వస్తుంది. ఈసారి అక్షయ తృతీయ అనేక శుభయోగాల సమ్మేళనంగా రాబోతుంది. దీంతో అక్షయ తృతీయను జరుపుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు.
అక్షయ తృతీయ నాడు అనేక శుభయోగాలు
అయితే ఈసారి అక్షయ తృతీయ కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని రాశుల వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి అన్ని విధాలుగా లాభం చేకూరుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ సందర్భంగా అనేక శుభ యోగాలు సంభవించనున్నాయి.

అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం
ఇక ఈ సంవత్సరం అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఏర్పడుతున్నటువంటి శుభయోగాలు అనేక రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షాన్ని తెచ్చి పెట్టనున్నాయి. అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల ధనలాభం, శ్రేయస్సు కలుగుతుంది. గజకేసరి యోగం కారణంగా అదృష్టం కలిసి వచ్చే రాశుల వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధనయోగం, శుక్రాదిత్య యోగం
అక్షయ తృతీయ నాడే ధన యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో వ్యాపారులకు పురోగతి అవకాశాలు లభిస్తాయి. ఇక అక్షయ తృతీయ నాడు శుక్రాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా వైవాహిక జీవితం సంతోషంగా ఉండటమే కాకుండా, ప్రేమ బంధాలు బలపడతాయి. విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.
శష రాజయోగం, మాళవ్య రాజయోగం, సుకర్మ యోగాలు
అంతేకాదు శష రాజయోగం కూడా ఇదే రోజు ఏర్పడుతుంది. దీని వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అక్షయ తృతీయనాడు సుకర్మ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మీరు కొన్ని శుభకార్యాలను నిర్వహించాల్సి వస్తుంది. అక్షయ తృతీయనాడు ఏర్పడే మాళవ్య రాజయోగం తో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, కొత్త ఆస్తులను పొందే అవకాశం లభిస్తుంది.
అక్షయ తృతీయ నాడు ఇలా చేస్తే ధనయోగం
అక్షయ తృతీయ పర్వదినాన బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనడమే కాకుండా, చాలామంది దానధర్మాలను చేస్తూ విష్ణుమూర్తి ని, లక్ష్మీదేవిని, కుబేరుని విశేషంగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇక వ్యాపారస్తులకు లక్ష్మీ పూజ చేస్తే ధనయోగం కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications