9 యేళ్ల ఇండియన్‌కి టోరంటో మూవీ అవార్డు

ముంబాయికి చెందిన తొమ్మిదేళ్ల పసివాడు అన్షుల్‌ ఖోస్లాకు కెనడాలోని టొరంటోలో జరిగిన యంగ్‌ ఫల్మ్‌ మేకర్స్‌ చలనచిత్రోత్సవంలో ఉత్తమ స్క్రిప్టు అవార్డు లభించింది. లవ్‌ ఛేంజెస్‌ ఎవరీథింగ్‌ అనే డాక్యుమెంటరీకి ఈ అవార్డు లభించింది. ఈ డాక్యుమెంటరీకి అతనే నిర్మాత, దర్శకుడు కూడా. సెయింట్‌ డామినిక్స్‌ సావ్యో ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన అన్షుల్‌ అండర్‌ - 10 కెటగిరీలో ఈ అవార్డు పొందాడు. భారత్‌ నుంచి చలనచిత్రోత్సవాల్లో ఇదొకటే ఎంట్రీ. నాలుగో తరగతి ఉత్తీర్ణుడైన ఈ బాలుడు వీధిబాలుర వాస్తవ గాథలతో ఈ డాక్యుమెంటరీ నిర్మించాడు.

వీధి బాలుర పరిస్థితికి అన్షుల్‌ విపరీతంగా చలించిపోయాడు. సేల్సియన్‌ మతగురువులు కొంత మంది వీధి బాలురకు ఆశ్రయమిచ్చారు. సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా అన్షుల్‌ ఒకసారి వీధిబాలుర శిక్షణా శిబిరాలను సందర్శించాడు. దీంతో గణేష్‌, బాబ్లూ, ఇజాజ్‌ పాత్రలపై దృష్టి కేంద్రీకరించి డాక్యుమెంటరీ నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ప్రేమ జీవితాలను మారుస్తుందని తాను విశ్వసిస్తానని, అందుకే ఈ డాక్యుమెంటరీ నిర్మించానని అన్షుల్‌ అంటున్నాడు. స్క్రిప్టు తయారు కాగానే మార్చి 6న షూటింగ్‌ ప్రారంభించి 7వ తేదీన ముగించాడు. స్నేహసదన్‌, సెయింట్‌ డామినిక్స్‌ సావ్యో బాయిస్‌ హోమ్‌లలో షూటింగ్‌ జరిపాడు. సోనీ కెమెరాను డాక్యుమెంటరీ తీయడానికి వాడాడు. ఈ డాక్యుమెంటరీ నిడివి 16 నిమిషాలు.

తాను ఇటువంటి సున్నితమైన విషయం మీదనే మరో సినిమా తీస్తానని, దాన్ని లవ్‌ ఛేంజెస్‌ ఎవరీథింగ్‌ అని పేరు పెడతానని అన్షుల్‌ చెప్పాడు. తాను భగవంతుడికి, పాఠశాల అధికార వర్గానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తూ కూడా తనకు సినిమా నిర్మాణంలో సహకరించిన తన సోదరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అతను చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+