నవంబర్ 25 వరకు ఈ రాశులవారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.. ఎందుకంటే?
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహ సంచారానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బుధుడి రాశి మార్పు మాత్రమే కాకుండా, అతడు ప్రవేశించే నక్షత్రం కూడా ద్వాదశ రాశుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. నవంబర్ 3న ఉదయం 6 గంటలకు బుధుడు రాహువు ఆధిపత్యం వహించే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు.
నవంబర్ 25 వరకు బుధుడు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. ఆ తర్వాత విశాఖ నక్షత్రంలోకి అడుగుపెడతాడు. రాహువు నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా రాబోయే మూడు వారాల పాటు (నవంబర్ 25 వరకు) ప్రధానంగా 4 రాశుల వారు తీవ్ర ఒత్తిడిని, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం కాస్త ప్రతికూలంగా మారవచ్చు. ఆఫీసులో పైఅధికారులతో అభిప్రాయ భేదాలు లేదా వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీ పనితీరుపై అనవసర ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు. దీనివల్ల మానసిక అశాంతి పెరుగుతుంది. ఊహించని విధంగా విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా ఉండటం చాలా అవసరం.
తులా రాశి
స్వాతి నక్షత్ర సంచారం తులా రాశి వారిపై నేరుగా ప్రభావం చూపుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు రావడం, సహోద్యోగులతో చిన్నపాటి వాదనలు తీవ్ర విభేదాలకు దార తీయడం జరగవచ్చు. పెట్టుబడుల విషయంలో లేదా పెద్ద మొత్తం ఖర్చు చేసే సమయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ కాలంలో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, దానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పని ఒత్తిడి వల్ల మానసికంగా అలసట, ఆందోళన పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత నిలపడం సవాలుగా మారుతుంది. శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కొత్త వ్యాపారాలు లేదా షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరి. విజయం సాధించే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండటం చాలా మంచిది. నవంబర్ 25 వరకు ఈ నాలుగు రాశుల వారు ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం, ఆర్థిక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. ప్రతిరోజూ బుధ స్తోత్రం లేదా రాహు కాలంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఈ ప్రతికూల ప్రభావాల తీవ్రత తగ్గుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications
