మళ్లీ పరుగులు పెడుతోన్న పసిడి రేట్లు- మున్ముందు.. !!
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ప్రభావంతో నేడు పసిడి రేట్లలో పెరుగుదల నమోదైంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పసిడి ధరల గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన మార్కెట్లలో ధరలు అప్ స్టిక్ లోనే సాగుతున్నాయి.
మంగళవారం నాటితో పోల్చుకుంటే నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 270 మేర పెరిగింది. దీంతో ధర 1,39,910 రూపాయలుగా నమోదైంది. ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 250 మేర పెరిగి, రూ. 1,28,250 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 పెరిగి రూ. 1,04,930 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో స్పాట్ బంగారం ఔన్సుకు 3,940 డాలర్ల మేర పలుకుతోంది. స్పాట్ వెండి నష్టాల్లో పడింది. ఔన్సుకు 50 డాలర్ల కంటే దిగువకు ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,910వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,28,250గా కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,39,910 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,28,250 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,910, రూ. 1,28,290 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,39,950, 22 క్యారెట్లు రూ. 1,28,250 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,495
ముంబై..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,493
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,493
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,493
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,493
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 13,991, 22 క్యారెట్లు - రూ. 12,825, 18 క్యారెట్లు - రూ. 10,493












Click it and Unblock the Notifications
