వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకుల ప్రతిస్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

ఇలా ప్రాంతీయ పార్టీల బలాన్ని కుదించడానికి, ప్రాంతీయ ఆకాంక్షల ప్రమేయాన్ని తగ్గించడానికి బిజెపి కొంత కృషి చేసింది. కార్గిల్‌ యుద్ధం సమయంలో ముందుకు తెచ్చిన దేశభక్తి గానీ, మొదటి నుంచి ముందుకు తెస్తున్న అయోధ్య వివాదం గానీ ఇందులో భాగమే. ఒక జాతీయ ఆకాంక్షను దేశమంతటా కలిగించే ప్రయత్నమే ఇది. అయితే బిజెపి కొంత వరకు ఈ విషయాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోగలుగుతోందే గానీ ప్రాంతీయ పార్టీలను అభావం చేయలేకపోతోంది. ఈ విషయాన్ని గమనించే బిజెపి వివిధ ప్రాంతీయ పార్టీలతో, వివిధ ప్రాంతాల్లో బలంగా వున్న జాతీయ పార్టీలతో స్నేహం నెరుపుతూ వస్తోంది. నిజానికి, బిజెపి లక్షణానికి, ఎజెండాకు ఇది విరుద్ధమైంది. అయినప్పటికీ అందుకు బిజెపి సిద్ధపడుతోందంటే వాస్తవ పరిస్థితులేమిటో అర్థం చేసుకోవచ్చు.

వివిధ ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడంలో బిజెపి కన్నా వెనుబడిపోవడం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధానమైన మైనస్‌ పాయింట్‌. ఇదే తప్పిదానికి కాంగ్రెస్‌ తిరిగి ఒడిగట్టబోతోంది. సోనియా గాంధీ విగ్రహమై పార్టీని విజయపథాన నడిపిస్తుందనేది కల్ల అనే విషయం గుర్తించకపోవడం వల్లనే కాంగ్రెస్‌ అందుకు సిద్ధపడుతోంది. దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించే ఉద్వేగపూరిత నినాదమేదీ ఉండనట్టే మెజారిటీ దేశప్రజలందరికీ ఆరాధ్య నేత ఎవరూ ఉండరు. అందువల్ల సోనియా గాంధీ తానే అంతా అయిపోయి పార్టీని గట్టెక్కిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రియాంక గాంధీ దిగినా పరిస్థితిలో మార్పేమీ ఉండకపోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X