ఎంతెంత దూరం?!

అయితే తెలంగాణ విషయంలో అధిష్ఠానం కచ్చితమైన నిర్ణయం తీసుకోవలని మాత్రం సత్యనారాయణరావు కోరుకుంటున్నారు. కష్టమో, నష్టమో ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామనేది ఆయన అభిప్రాయం. నిజానికి సత్యనారాయణరావు కోరిక సమంజసమైనదే. కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తున్న అధిష్ఠానం నాన్చుడు వైఖరి తెలంగాణ నాయకులకే కాకుండా ఇతర ప్రాంతాల నాయకులకు కూడా ఇబ్బందిగా వుంది.
తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల తీరుకు వ్యతిరేకంగా రాయలసీమ, కోస్తా నాయకులు ఇటీవల సమావేశమయ్యారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది వీరి మంత్రం. తెలంగాణ నాయకుల ఆగడాలను అరికట్టాలనేది వారి అభిమతం. ఇలా తమ నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయి శిబిరాలు నడుపుతుంటే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా సత్యనారాయణరావు చేతులుడిగినట్లు ఉండిపోవాల్సి వస్తోంది. పార్టీని ఏకతాటి మీద నడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయించాల్సిన ఆయన ఇటువంటి పరిస్థితుల్లో చేసేదేం ఉంటుంది?

ఈ స్థితిలో రాష్ట్ర నాయకత్వానికి, కాంగ్రెస్‌లోని తెలంగాణవాదులకు మధ్య పెరుగుతున్న దూరం ఎంత వరకు పోతుందనేది ప్రశ్న. అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే టిఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్న తెలంగాణ నాయకులు ఏం చేస్తారనే ప్రశ్నకు ఇప్పుడే సమాధనం దొరకదు. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదరవచ్చు. అయితే మిగతా ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ నాయకుల ప్రతిస్పందనలు, చర్యలు ఎలా ఉంటాయనేది పెద్ద సమస్య. ఈ సమస్య దృష్ట్యానే తెలంగాణ విషయంలో అధిష్ఠానం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ ఉండవచ్చు. అయితే నాన్చివేత ధోరణి కూడా ఏదో మేరకు నష్టం చేస్తుందనే విషయం అధిష్ఠానం గుర్తించడం లేదు. ఇదే పెద్ద ట్రాజెడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+