హలీమ్ తిందామంటే సలీమ్ లేడు!!
హలీమ్ తిందామంటే సలీమ్ లేడు...దుబాయ్ ఎళ్లిండు. శంకర్ బిజీ అయిపోయిండు...సాఫ్ట్ వేర్ జాబ్ ల చేరిండు. జలీల్ అడ్రస్ లేడు...గ్రాఫిక్ డిజైనర్ గద.. రహమాన్ గాడు టీవీ చానెల్ లో చేరింతర్వాత ఇంటికే టైమ్ యిస్తలేడు...హలీమ్ తిననీకి టైమేడిస్తడు. ఒంటరిగా వెళ్లి హలీమ్ తింటే మజా రావట్లేదు. భయమయితోంది. బాంబు ఎక్కడ పేలుతోందోనని. బాంబులకన్నా ముందు కల్చర్ లెస్ జనాలతోని జమాయించుడు తకిలీఫ్ అవుతోంది. ఇపుడు వాల్లంతా ఎగబడి హలీమ్ తింటుండ్రు. వాళ్లు తింటుంటే చూడాలీ కడుపులో ఇకారం వస్తోంది...నిలబడనీకి చోటుండడంలేదు. ఎక్కడ పడితే అక్కడ పాన్ షాపుల్లెక్క హలీమ్ సెంటర్లు పెట్టినా అప్పటి లెక్క ఉండడంలేదు. హలీమ్ తయారు చేసేటోళ్లు గూడ బాగా మారిపోయిండ్రు. లాభం మీదనే దృష్టి పెడుతుండ్రుగానీ తినేటోన్ని పట్టించుకుంటలేరు. రేటు కూడా జబర్ దస్త్ పెంచిండ్రు. క్వాలిటీ లేదంటే తప్పు మాది గాదంటున్నరు. విదేశీ గోధుమల్దే అంతా తప్పంటున్నరు. క్వాంటిటీ సంగతేమంటే కామోష్ అవుతున్నరు. అరే తింటే తిను లేకుంటే పో అంటున్నరు. హలీమోనికన్నా ముందు అఢ్డగోలుగ హైదరాబాదొచ్చిన హవ్ లాగాళ్లు నెట్టేసి తింటున్నరు.
15 ఏళ్ల కింద హలీమ్ కు ఇప్పటి హలీమ్ కు మస్తు తేడా ఉన్నది. బిర్యానీ కూడా గట్లనే టేస్ట్ మారింది. మారిన హైదరాబాద్ లెక్కనే. హైబ్రీడ్ కల్చర్ లెక్క... టేస్ట్ కరాబయింది. అయినా లైఫ్ టేస్ట్ తెలిసినోళ్లెవరున్నారని..ఉన్నా.. వాళ్లు ఇంతకుముందు లెక్క బజార్లకు రావట్లేదు. బజార్ల ఢిఫరెంట్ జనాలుంటున్నరు గద. డెవలప్ మెంటల్ గాళ్లు ఉంటరని భయపడిపోతున్నరు. అరే సలీమ్, శంకర్, వెంకట్రామ్ రెడ్డి, రహమాన్, జలీల్.. ధిమాక్ ఖరాబ్ అవుతున్నది. జర రారాదుండ్రి...అప్పటిలెక్క అందరం గలిసి హలీమ్ తిందాం. మజా చేద్దాం..ఎందుకంటే ఎక్కడ బాంబు పేలుతుందో...ఎవడుంటడో...ఎవడుపోతడో...పోయేలోపల ఒక్కసారి కలిసి హలీమ్ తిందాం.












Click it and Unblock the Notifications