ఇక ఇంటర్నెట్ సీరియళ్లు
సినిమా, టెలివిజన్ తర్వాత సైబర్ స్పేస్ భారత ఎంటర్టైన్ మెంట్ పరిశ్రమకు కొత్త మీడియా కానుంది. అయితే ఈ క్రమం నెమ్మదిగానే సాగవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం అది తప్పదనిపిస్తోంది. బాలీవుడ్ ఇంటర్నెట్ ను ప్రచారం కోసం వాడుకోవడం ఇప్పటికే మొదలైంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ థియేటర్లలో విడుదలవుతూనే, ఇఁటర్నెట్లలో ప్రీమియర్ షోలను వేస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ కోసమే ప్రత్యేకంగా షోలు నిర్మాణమయ్యే పరిస్థితులు ఎంతో కాలం లేదనిపిస్తోంది. ఇది మీడియం తమ సృజనాత్మకతను ప్రకటించుకోవడానికి కొత్త నిర్దేశకులకు మంచి అవకాశం కూడా కావచ్చు.
దేశంలో ఆన్ ద ఆన్విల్ ఇన్ ఇండియా అనే సీరియల్ ప్రత్యేకంగా ఇంటర్నెట్ కోసం నిర్మాణవుతోంది. దేశంలో తొలి ఇంటర్నెట్ సీరియల్ ఇదే. టాంజెరిన్ డిజిటల్ ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ ఎంటిటి కాంపస్ 18 దీన్ని నిర్మిస్తోంది. దేశంలోని యువకుల ప్రతిభను వెలికి తేవడంలో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తన ఇంటర్నెట్ సీరియల్ కోసం ఈ సంస్థ కొత్త ముఖాల కోసం అన్వేషిస్తోంది. వీడియో టాలెంట్ వేటలో న్యాయమూర్తులు ఎంపిక చేసినవారికి తొలి ఇంటర్నెట్ సీరియల్ లో నటించే అవకాశం లభిస్తుంది. వివిధ కెటగిరీల్లో విజేతలను ఎంపిక చేసి మార్చి 28వ తేదీన ముంబయిలో ప్రకటిస్తారు.
సినీ రంగంలోకి అడుగు పెట్టదలుచుకున్నవారికి ఇది మంచి వేదిక అని, తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయని టాలెంట్ వేటలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఎంటివి విజె నిఖిల్ చిన్నప్ప అంటున్నారు.












Click it and Unblock the Notifications