శ్రీశాంత్ కొత్త పాత్ర

ప్రముఖ టెలివిజన్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నృత్యాలతో, పాటలతో ఈ కార్యక్రమం వీక్షకులను ఆనందడోలల్లో ఓలలాడించనుంది. అయితే ఈ కార్యక్రమానికి సామాజిక స్పర్శను కూడా జోడిస్తున్నారు. భారత దేశం ఔన్నత్యాన్ని, సంస్కృతిని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. మహిళా పోలీసు అధికారి కిరణ్ బేడి, నటులు రోనిత్ రాయ్, హర్షద్ చోప్రా, కరణ్ పటేల్, లిలీ పటేల్, సరితా జోషి, శరన్ ఖాన్, పరుల్ చౌహాన్, అదితి గుప్తా, అమీర్ అలీ, సంజీదా షేక్, దేవన్ భోజాని, లుబ్నా సలీం, సుచితా త్రివేది, కృష్ణా గోకాని, చేతన్ హంసరాజ్, బాల మేధావులు శ్రేయ, ధేరియా, ఐశ్వర్య, అన్వేష, గాయకులు అభిజిత్ సావంత్, రాహుల్ వైద్య తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముఖ్య విశేషం క్రికెటర్ శ్రీశాంత్, యాంకర్ మందిరా బేడి నృత్యాలు. శ్రీశాంత్ బాగా డ్యాన్స్ చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే.












Click it and Unblock the Notifications