స్పృహ తప్పిన టెండూల్కర్

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ లతో కలిసి టెండూల్కర్ జోహెన్నెస్ బర్గ్ లోని రెస్టారెంటుకు డిన్నర్ కోసం వెళ్లాడు. గదిలోకి తిరిగి వచ్చిన తర్వాత తల తిగిరినట్లై పడిపోయాడు. ముక్కు దగ్గర దెబ్బ తగిలింది. ఎడమ కంటి వద్ద కూడా గాయమైంది. అయినప్పటికీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడానికి సిద్ధమయ్యాడు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నాడు. వెస్టిండీస్ పై జయాపజయాలతో సంబంధం లేకుండా సెమీ ఫైనల్ కు చేరుకోవడంలో భారత్ విఫలమైంది. దాంతో ఈ మ్యాచుకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ కారణంగా టెండూల్కర్ మ్యాచు నుంచి తప్పుకున్నాడు. తన రెండు దశాబ్దాల క్రీడాజీవితంలో ఆ విధమైన పరిస్థితిలో మ్యాచు నుంచి తాను తప్పుకోవాల్సి వచ్చిందని టెండూల్కర్ అన్నాడు.












Click it and Unblock the Notifications