పామే నిత్యానందను పట్టించిందా?

Nityananda Swami
ఓ సర్పం నిత్యానంద స్వామి మరిన్ని అక్రమాలను పట్టించిందా? ఆశ్రమంలో ఉన్న పామును పట్టుకోవడానికి వచ్చిన హెర్పటాలిజిస్టు శరత్ బాబు అక్కడేవో అక్రమాలు జరుగుతున్నాయని పసిగట్టడమే నిత్యానంద స్వామి మెడకు చుట్టుకుందట. పామును పట్టుకోవడానికి వచ్చిన హెర్పటాలిజిస్టు సమాచారంతో పోలీసులు నిత్యానంద స్వామి ఆశ్రమంలోని అక్రమ గంధపు చెక్కను పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వార్తాకథనాన్ని ముంబైకి చెందిన ఒక పత్రిక ప్రచురించింది. ఆ పామే నిత్యానంద స్వామి పాపాలు బయటపడడానికి మార్గం చూపినట్లు భావిస్తున్నారు. నటి రంజితతో నిత్యానందస్వామి లైంగిక కార్యకలాపాలను ఒక టీవీ చానెల్ ప్రసారం చేసిన వెంటనే అటవీ అధికారులు బీదాడి ఆశ్రమంపై దాడి చేశారు. అక్కడ దాదాపు 60 కిలోల గంధపు చెక్కలను వారు పట్టుకున్నారు.

అటవీశాఖలో గౌరవ వార్డెన్ గా పనిచేస్తున్న హెర్పటాలిజిస్టు శరత్ బాబు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆ పత్రిక రాసింది. సెక్స్ టేప్ బయటకు రావడానికి రెండు రోజులు ముందు శరత్ బాబు సర్పాన్ని పట్టుకోవడానికి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడేవో అక్రమాలు జరుగుతున్నట్లు పసిగట్టిన అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడట. నిత్యానంద స్వామి జంతుచర్మాలు కూడా వాడినట్లు అధికారులు చెబుతున్నారని ఆ పత్రిక రాసింది. తమిళనాడులోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఇటువంటి సోదాలే జరిగాయి. సెక్స్ కుంభకోణం బయటపడిన వెంటనే ఆశ్రమాన్ని కొంత మంది దగ్ధం చేశారు. సెక్స్ కుంభకోణం నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తారని తెలుసుకున్న నిత్యానంద స్వామి అనుచరులే మరిన్ని అక్రమాలు వెలుగు చూడకుండా ఆశ్రమాన్ని దగ్ధం చేసినట్లు చెబుతున్నారు. అక్రమ వస్తువులు ఉండి ఉంటాయని, సాక్ష్యాలను మాయం చేయడానికి కాలబెట్టి ఉంటారని పోలీసులు అంటున్నారు.

ఆశ్రమానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కర్నాటకలోని ఆశ్రమ యాజమాన్యంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సెక్స్ టేప్ బయట పడని వెంటనే మాయమైన నిత్యానంద స్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను మైసూరులో ఉన్నాడని కొంత మంది చెబుతుండగా కుంభమేళాకు వెళ్లాడని మరి కొంత మంది చెబుతున్నారు. నిత్యానంద స్వామి ఆశ్రమం ఉన్న భూమి ప్రభుత్వానిదని, పశువుల మేత కోసం దాన్ని నియోగించినట్లు కర్నాటక హోం మంత్రి విఎస్ ఆచార్య గురువారం చెప్పారు. ఈ వ్యవహారం మాట్లాడడానికి వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ బికె సింగ్ నిరాకరించినట్లు ఆ పత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+