వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖజానాకు లిక్కర్ కిక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Liquor kick AP Treasury
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ముఖ్యమంత్రి కె. రోశయ్య లిక్కర్ కిక్ ఇస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా పెద్ద యెత్తున నిధులు సమకూర్చునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కోట్లాది రూపాయలకు టెండర్లు రాపడంతో ప్రభుత్వం హుషారెత్తినట్లె ఉంది. ఈ ఏడాది మద్యం దుకాణాలకు పలికిన ధర ఆబ్కారీ ఆదాయాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కల్పించింది. ఆబ్కారీ శాఖ ఈ ఏడాది రాష్ట్ర ఖజానాకు దాదాపు 25 వేల కోట్లకు పైగా జమ చేసే అవకాశం ఉందని అంచనా.

ఖజానాకు వెలుగులు నింపుతున్న ఆబ్కారీ శాఖ ఒక్క లైసెన్స్‌ రుసుముగానే రూ. 7000 కోట్లు జమ చేయబోతుంది. మద్యం దుకాణాల వేలం ప్రభుత్వానికి కనకవర్షం కురిపిస్తోంది. 2008-10 సంవత్సరానికి దుకాణాలను వేలం వేయడంతో లైసెన్స్‌ ఫీజుగా రూ.3182 కోట్లు జమయింది. 2010-11 సంవత్సరానికి దుకాణాల లైసెన్స్‌ ఫీజు రూ. 3680 కోట్ల మేరకు రాబట్టాలని అధికారులు అంచనా వేశారు. టెండర్లు తెరిచి దుకాణాల లైసెన్స్‌ ఖరారు చేసేనాటికి రూ. 6900 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేశారు. అయితే 7000 కోట్ల వరకు లైసెన్స్‌ ఫీజు రాబట్టే అవకాశం ఏర్పడిందని వివరించారు. ఆబ్కారీ అధికారులు గుర్తించిన దాదాపు 30 దుకాణాలు ప్రభుత్వ ఖజానాకు పెద్ద యెత్తున రాబడిని సమకూరుస్తున్నాయి.

2008-10 ఆబ్కారీ సంవత్సర కాలంలో మద్యం విక్రయాలు రూ. 12 వేల కోట్లకు చేరాయి. ఈ సంవత్సరం రెట్టింపు విక్రయాలు జరిగే అవకాశం ఉందని లిక్కర్‌ సిండికేట్‌ పసిగట్టింది. టెండర్‌ ఫారాలను విక్రయించడం ద్వారానే రూ. 48 కోట్లు ఆబ్కారీ శాఖ ఆర్జించింది. బినామీ పేర్లతో జారీ అయిన లైసెన్స్‌లే అధికం అని ఆబ్కారీ అధికారులు నిర్ధారించారు. తమకు కావలసింది ఆదాయం, ఎవరు దుకాణం పొందుతున్నారన్నది ముఖ్యం కానే కాదు, ఎంత వేలం పాడారు, ఎంత ఆదాయం రాబట్టగలం అన్నదే ముఖ్యమనే ఉద్దేశంతో ఆబ్కారీ శాఖ పనిచేయడం ప్రారంభించింది. వేలం పాటల్లో ఒక్కో దుకాణం కోట్లాది రూపాయలు పలికింది. గుంటూరు జిల్లాలోని ఓ దుకాణం నాలుగున్నర కోట్లకు పైగా పిలికి రికార్డు సృష్టించింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లోని దుకాణాలు కూడా కోట్లాది రూపాయలకు వేలం పాటలో పోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా సంస్థల యజమానులు కూడా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టారు. వచ్చే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. మంచినీళ్లు దొరకకున్నా మద్యం మాత్రం ఎల్లవేళలా, అన్ని చోట్లా అడిగిందే తడవుగా దొరికే ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X