వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి కనిపించుట లేదు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తన వారికి కష్టం కలిగిన సమయంలో అప్పటికప్పుడు ప్రత్యక్షమై సినిమాలలో ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన నిజ జీవితంలో మాత్రం మొహం చాటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రం అటు తెలంగాణ, ఇటు సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధుల హెచ్చరికలు, ఉద్యమాలు, బందులతో అట్టుడుకుతుంటే సినిమాలలో ప్రత్యక్షమయ్యే చిరంజీవి మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తదనంతర పరిస్థితుల కారణంగా కాంగ్రెసు పార్టీని ఆదుకునే వ్యక్తిగా అధిష్టానానికి కేవలం చిరంజీవి ఒక్కడే కనిపించాడు. ఆ నమ్మకంతో అధిష్టానం ప్రత్యేకంగా చిరంజీవిని పిలిచి మాట్లాడింది. రాష్ట్రం తరఫున ప్రధానమైన బాధ్యతలో చిరంజీవిని కూర్చుండబెట్టేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అయితే అందుకు సమయం రాక పోవడం వేరే విషయం. కాంగ్రెసులోని ప్రధాన నేతలకు అరుదుగా దొరికే సోనియాగాంధీ దర్శన భాగ్యం ప్రత్యేకంగా కల్పించారు.

చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని నేతలు సైతం చిరంజీవి రావడం రాష్ట్ర కాంగ్రెసుకు మంచి ఎసెట్ అన్నారు. అయితే వారి ఆశలన్నీ చిరంజీవి అడియాసలు చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు తెలంగాణ, మరోవైపు సీమాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న ఈ సమయంలో చిరంజీవి ఎక్కడా కనిపించ కుండా పోయాడు. కనీసం సమైక్యాంధ్ర కోసం, తెలంగాణ కోసం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న తన పార్టీ ప్రజాప్రతినిధులను సైతం ఆయన ఆపలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఓ వైపు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం వద్దకు వెళ్లి మాట్లాడాలని, రాజీనామాలు, బెదిరింపుల వల్ల సమస్య పరిష్కారం కాదని సూచిస్తున్నారు.

కానీ రాష్ట్ర కాంగ్రెసును కాపాడుతాడని నమ్మకం పెట్టుకున్న అధిష్టానాన్ని, రాష్ట్ర కాంగ్రెసు నేతల, కార్యకర్తల నమ్మకాన్ని మాత్రం చిరంజీవి నిలబెట్టలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బయటకు వస్తే సమస్య తీరుతుందా అనే వారు ఉండవచ్చు. కానీ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని అధికారికంగా ప్రకటించి, తనకు తాను కాంగ్రెసు నేతగా పేర్కొని, భావి ముఖ్యమంత్రిగా అభిమానులు, పలువురిచే భావింపబడుతున్న చిరంజీవి ఇరు ప్రాంతాల నేతలతో మాట్లాడి తన వంతు ప్రయత్నం ఎందుకు చేయడం లేదని పలువురి వాదన. రాష్ట్ర కాంగ్రెసును మారుస్తాడని భావించిన చిరంజీవి సమస్యలకు భయపడి బయటకు రావడం లేదని ఇలాంటి వారని భావి ముఖ్యమంత్రిగా ఎలా పేర్కొంటామని అనే వారూ ఉన్నారు. సమైక్యాంధ్రకు జై అన్న చిరంజీవి కనీసం సీమాంధ్ర నేతలకు సైతం సర్ది చెప్పక పోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

English summary
It seems, PRP president Chiranjeevi disappeared in peak time. CM Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana are talking with Seemandhra and Telangana leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X