వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోస్ట్ వాంటెడ్ దావూద్ భవనం మోస్ట్ వాంటెడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dawood Ibrahim
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 1990 ప్రాంతాల్లో నివసించిన బెండీ బజార్ చరిత్రను ఆ ప్రాంత వాసులు ఇప్పటికి మరిచిపోలేరు. అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సైఫీ బుర్ హానీ ట్రస్టు ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న దావూద్ భవనాన్ని తాము కొంటామని ఆ సంస్థ కార్యదర్శి అబ్దీలీ భాన్ పురావాలా పోలీసు కమీషనర్‌కు లేఖ రాశారు. బెండీ బజార్ లో దావూద్ అనుచరుల భవనాలు కూడా మూడు నాలుగు ఉన్నాయి. అయితే వీటిలో ఒక దాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయం స్వాధీనం చేసుకోగా, మిగిలిన భవనాలను విదేశీ మారక ద్రవ్యం చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 289 నివాసిత భవనాలున్న ఈ బెండీ బజార్ ప్రాంతాన్ని పునరాభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన బుర్హానీ సంస్థ, ఆ ప్రాంత పరిధిలోకి వచ్చే ఉన్న పాక్ మోడియా వీధిని కూడా అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉంది. దావుద్ సోదరుడు ఇక్భాల్ కస్కర్ నివసిస్తున్న ఈ వీధిలో నివసిస్తున్నాడు. ఇక్కడే అతనిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

బెండీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతో పాటు, ఆ ప్రాంతంలో నెలకొన్న దావూద్ మచ్చను కూడా తొలిగించేందుకు బుర్ హానీ సంస్థ తోడ్పడాలని సీనియర్ పాత్రికేయుడు ఎస్.బాలకృష్ణన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో నిఘా వేసి దావూద్ నుంచి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.2వేల కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాంత అభివృద్ధి పనుల ద్వారా 3200 మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు.

జనవరి 2001లో ప్రభుత్వాధికారులు వేసిన దావూద్ ఆస్తుల వేలానికి స్పందన లభించలేదు. ప్రాణ భయంతో ఎవరు ఈ భవనాలను కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అదే ఏడాది సెప్టంబర్ లో దావూద్ కు సంబంధించి 13 ఆస్తులకు సంబంధించిన వేలంలో కేవలం 144 చదరపు గజాల షెడ్ మాత్రమే కోనుగోలు జరిగింది.

English summary
Saifee Burhani Upliftment Trust has, in what some would call a daring move, asked the government to let it purchase 3-4 buildings owned by the dreaded gangster or his gang, which are currently sealed. Dawood lived in the area until the early 90s.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X