సినీ తెరకెక్కిన కనిమొళి క్యారెక్టర్

Kanimozhi
ఈ మధ్య మన దేశంలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే కనిమెళి(డీఎంకే అధ్యక్షుడు.. కరుణానిధి కూతురు). దేశంలోనే అతిపెద్ద కుంభకోణం.. 2 జీ స్పెక్ట్రమ్ కేసుపై చెన్నైలో ఓ సినిమా ప్రారంభమైంది. ఏకంగా 2 జీ స్పెక్ట్రమ్ అనే టైటిల్ తోటే.. సినిమాను నిర్మిస్తున్నారు. 2 జీ స్పెక్ట్రమ్ కేసులో.. తిహార్ జైల్లో శిక్ష అణుభవిస్తున్న కనిమొళి కథే.. సినిమా స్టోరీకి సెంటర్ పాయింట్. ప్రముఖ పాత్రికేయులు జాన్ మనోహర్ 2 జీ స్పెక్ట్రమ్ సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమాలో కనిమొళి పాత్రను ప్రముఖ నటి లక్ష్మీ రామకృష్ణన్ పోషిస్తున్నారు.

అలాగే ఈ కేసులో ప్రధాన నింధితుడు.. మాజీ టెలికం శాఖా మంత్రి ఏ రాజా క్యారెక్టర్ ను రియాజ్ ఖాన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో కీలక మలుపు.. కార్పోరేట్ లాబీయిస్టు నీరా రాడియా పాత్రను.. మలేషియాకు చెందిన నాడోడిగళ్ ఫేమ్ నటి చాందిని యాక్ట్ చేయనుంది. మరోవైపు కేంద్రమంత్రి అళగిరి పాత్రను కమెడియన్ సింగముత్తు పోషిస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రధానాధికారిగా సత్యరాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. 2 జీ స్పెక్ట్రమ్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగానే.. ఈ విషయంపై సినిమా రావడం విశేషం గా చెప్తున్నారు. మరి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో మరి అందరూ తమకు తోచిన విదంగా చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+