భ్రష్టు పట్టిపోతున్న నందమూరి హీరోల డైలాగులు!
సినీ పరిశ్రమలో నందమూరి హీరోలు చెప్పే డైలాగులు సపరేట్ గా ఉంటాయి. తొడగొట్టడం, కంటి చూపుతో చంపేస్తాం...తదితర డైలాగులు ఎక్కువగా వీరి నుంచే వస్తాయి. ఒకప్పుడు థియేటర్లను షేక్ చేసిన డైలాగులు ఇవి. కొన్ని సినిమాలైతే కేవలం ఈ తరహా డైలాగులతోనే సూపర్ హిట్టయ్యాంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఇలాంటి డైలాగులు విని తెగ సంబర పడిపోయారు సినీ జనాలు. అయితే రాను రాను ఈ డైలాగుల జోరు మరీ ఎక్కువ కావడంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి తగ్గి పోయింది. అయితే తాజాగా పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే ఆ డైలాగు వినిపస్తే చాలు విసుగు చెందుతున్నారు ప్రక్షకులు. ఆ డైలాగులను పాత చింతకాయ పచ్చడిలా ఫీలవ్వడమే ఇందుకు కారణం.
అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు కొంటె దర్శకులు...ఆ డైలాగులనే కామెడీ రూపంలో మార్చుతూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తున్నారు. దీంతో ఒకప్పుడు సీరియస్ గా వినిపించిన ఆ డైలాగులు ఇప్పుఃడు అవే థియేటర్లో నవ్వుల పాలవుతున్నాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా వచ్చిన 'దూకుడుః" సినిమా, అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'మడత ఖాజా" సినిమాల్లో నందమూరి హీరోల డైలాగులు కామెడీ బాంబులుగా పేలుతున్నాయి. దూకుడులో మహేష్ బాబు వినిపించిన డైలాగ్ ...''నాయక్ వస్తాడో వాడి అబ్బ వస్తాడో రమ్మను, రూం నె. 306, తాజ్ హోటల్. నీ వెనక మాఫియా ఉంటే నా వెనుక మామయ్య(బ్రహ్మానందం) ఉన్నాడు, ఇప్పడు వచ్చినా సరే..నైటైనా సరే..పగలైనా సరే.."" అంటూ సాగుతుంది. ఇక మడత ఖాజాలో అల్లరి నరేష్ డైలాగ్.... '' తొడగొడతా, పిర్రగిల్లుతా అని చెప్పుకునే రకం కాదు"" అంటూ సాగుతుంది.
అంటే ఒకప్పుడు థియేటర్లను షేక్ చేసిన నందమూరీ హరోల డైలాగులు..ఇప్పడు కామెడీ రూపంలో భ్రష్టు పట్టి పోతున్నాయన్నమాట. నందమూరి అభిమానుల మాత్రం తమ అభిమాన హీరోల డైలాగులు ఈ విధంగా నవ్వుల పాలవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కొందరు అభిమానులు ఇలా చేయడంపై ఆందోళన చేద్దామని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. అయితే ఇలా చేయడం వల్ల మన హీరోలకే బ్యాడ్ నేమ్ మస్తుందని మరికొందరు సర్ది చెప్పడంతో మిన్నకుండి ఓపికతో ఆ డైలాగులను భరిస్తున్నారట పాపం!












Click it and Unblock the Notifications