వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒత్తిడిలో అమెరికా కన్నా మనమే ముందు

By Srinivas
|
Google Oneindia TeluguNews

World Health Organization
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఎవరంటే భారతీయులే అంటోంది, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాయోజకత్వంలో జరిగిన ఓ అధ్యయనం. ప్రపంచంలో ఎక్కువ ఒత్తిడికి గురవతున్న వారు ఎవరో తెలుసుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఇటీవల భారత్‌తో పాటు అమెరికా, ఫ్రాన్సు, నెదర్లాండ్స్, చైనా తదితర పద్దెనిమిది దేశాల్లో దాదాపు తొంబై వేల మందిని ఈ అధ్యాయన సంస్థ ప్రశ్నించి, పరిశీలించింది. అంతేకాదు ఇటీవల అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడుతూ, ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలో సైతం నిలకడగా ఉన్న మన పక్క దేశమైనా చైనా అంత అభివృద్ధితో ముందుకు పోతున్నప్పటికీ టాప్ ఫోర్ స్థానంలో కనిపించలేదు. అదే పెద్దన్న అమెరికా నాలుగో స్థానంలో ఉండటం విశేషం. మన విషయానికి వస్తే నిరుద్యోగం, భద్రత లేని ఉద్యోగం, ప్రాజెక్టులు, టార్గెట్లు, ప్రేమ, కుటుంబ ఒత్తిళ్లు తదితరాల కారణంగా భారతీయులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నట్టు ఆ నివేదిక తేల్చింది. మన దేశంలో ప్రతి వంద మందికి 36 మంది చాలా ఒత్తిళ్లకు గురవుతున్నారు.

ఒత్తిడిని నిర్వహించడానికి వారు కొన్ని లక్షణాలను ప్రమాణంగా తీసుకున్నారు. విచారం, దేనిమీదైనా ఆసక్తి కోల్పోవడం, ఆనందంగా లేక పోవడం, తప్పు చేసిన భావనతో బాధపడటం, ఆత్మవిశ్వాసం లోపించడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, నీరసం, ఏకాగ్రత లేక పోడం తదితర అంశాలతో అధ్యయనం చేశారు. వీటిలో కొన్ని లక్షణాలు కనిపించినా వారు ఒత్తిడితో బాధపడుతున్నట్టుగానే వారు పరిగణించారు. ఈ ప్రశ్నలను సంధించినప్పుడు అన్ని దేశాల కంటే మన దేశంలోని వారే బాగా ఒత్తిళ్లకు గురయినట్లుగా వారి నివేదికలో వెల్లడయింది. మన తర్వాత నెదర్లాండ్స్, ఫ్రాన్సు, అమెరికా వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. చైనా దేశం టాప్ ఫోర్‌లో లేదు. అయితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ తర్వాత మూడు స్థానాల్లో ఉన్న దేశాలు సంపన్న దేశాలు. అంటే సంపన్న దేశాలకు ఒత్తిళ్లకు సంబంధం లేదని ఈ అధ్యయనంలో తేలింది.

తక్కువ మధ్య తరగతి ఆదాయం ఉండే దేశాల్లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు అంటే పదకొండు శాతం, ఎక్కువ ఆదాయం ఉండే దేశాల వారిలో ప్రతి ఏడుగురిలో ఒక్కరు అంటే పదిహేను శాతం మంది ఒత్తిళ్లకు గురవుతున్నారంట. అంతేకాదు జీవిత భాగస్వామిని కోల్పోవడం వల్లనే అత్యధికులు ఒత్తిడికి గురవుతున్నారంట. ఏటా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారంట. అయితే ఒత్తిళ్ల వల్ల చాలా నష్టం ఉందని కూడా వారు పేర్కొన్నారు. ఒత్తిళ్లకు గురైన వారు పని చేసే సామర్థ్యం కోల్పోతున్నారు. అంతేకాదు ఇతరులతో ఉన్న సంబంధాలను నిలుపుకోవడంలో, కొత్త సంబంధాలను పెంపొందించుకోవడంలోనూ విఫలం అవుతున్నారు. ఒత్తిళ్ల కారణంగా లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయంట.

English summary
World Health Organization revealed that Indians more pressure with their activities. America got fourth place and France third.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X