• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐటిపై ఇన్ఫోసిస్ ఫలితాల దెబ్బ

By Nageswara Rao
|

IT Sectors
ఇండియాలో రెండవ అతి పెద్దదైన సాప్ట్ వేర్ సర్వీసెస్ కంపెనీ ఇన్పోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్. శుక్రవారం తన Q4 ఫలితాలను ప్రకటించింది. ఇన్పోసిస్ కంపెనీ లాభాలను ఆశించిన దానికంటే లాభాలను తక్కువగా గడించింది. ముఖ్యంగా క్లయింట్ స్పెండింగ్, షేర్స్ లాభాల్లో ఆశించిన మేరకు రాకపోగా 7శాతం తగ్గిపోయింది. ఈ ప్రభావం దాదాపు ఇండియాలో ఉన్న $60 బిలియన్ల్ ఐటి సెక్టార్ వరకు ప్రభావం చూపుతుందని నిపుణుల అంచనా.

ఇలా జరగడానికి కారణం గ్లోబల్‌గా ఎకానమీ తగ్గుదల, మార్చి 2012కి మార్జిన్స్, కరన్సీ రిస్క్‌లు కూడా తగ్గుముఖం పట్టడం కూడా ప్రభావం చూపిందని అంచనా వేశారు.ఈ సందర్బంలో తేజాస్ ధోషి(వైస్ ప్రెసిడెంట్, సుశీల్ ఫైనాన్స్) ముంబయి మాట్లాడుతూ అసలు ఇన్పోసిస్ ఏ పద్దతి ప్రకారం ఎక్కువ అంచనాలను పెట్టుకుందో నాకు అర్దం కావండ లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లైతే గ్లోబల్ ఎకానమీ పరిస్ధితి సరిగా లేనందువల్ల క్లయింట్ ఖర్చుపెట్టేటటువంటి డబ్బు కూడా బాగా తగ్గింది. ఈ సంవత్సరం మార్జిన్స్ కూడా కంపెనీలకు చాలా ఒత్తిడిలో ఉన్నాయి.

సాప్ట్ వేర్ సర్వీసెస్‌‌లలో నెంబర్ వన్‌గా ఉన్నటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మూడవ స్దానంలో ఉన్న విప్రో లిమిటెడ్ కూడా తమ ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఐబియమ్, ఎసెంచర్ కంపెనీల మాదరి టాలెంట్‌ని ఓ ఆయుధంగా చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సాప్ట్‌‌వేర్ రంగంలో కొన్ని ఒడిదుకులను చూడడం జరిగింది. విప్రో కంపెనీ తమ యొక్క ఛీఫ్‌లను మార్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఇన్ఫోసిస్ మానవ వనరుల విభాగం అధిపతి టివి మోహాన్ దాస్ పాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇది మాత్రమే కాకుండా తను గనుక కంపెనీలో ఉన్నట్లేతే రాబోవు కాలంలో కంపెనీ సిఈవో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఐతే మోహాన్ దాస్ పాయ్ జూన్ 2011 వరకు తన జాబ్ లోనే కొనసాగుతారు. ఆ తర్వాత ఆయన కంపెనీ నుండి వైదోలగుతారు. టివి మోహాన్ దాస్ పాయ్ ఇన్పోసిస్ కంపెనీ‌లో 1994వ సంవత్సరంలో చేరగా మే 200వ సంవత్సరం వరకు మెంబర్ ఆఫ్ బోర్డ్‌గా కోనసాగారు. పాయ్‌కి ఇన్ఫోసిస్‌తో పదహారు సంవత్సరాల అపారమైన సంబంధం ఉంది. ఈ పదహారు సంవత్సరాలలో పాయ్ కంపెనీ ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసియర్‌గా, డైరెక్టర్ ఇన్‌ఛార్జి మానవ వనరుల విభాగం(ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి) అధిపతులుగా భాద్యతలను నిర్వర్తించారు. ఈరోజు Q4 ఫలితాలు ప్రకటించగానే ఇన్పోసిస్ షేర్లు ఒక్కసారిగా 7.9శాతానికి పడిపోవడం జరిగింది. గతంలో ఇలా మే 19, 2009వ ఒక్కసారి మాత్రమే జరగడం విశేషం.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే యుయస్, యురోపియన్ దేశాలలో కూడా ఇన్ఫోసిస్ ఎకానమీ చాలా వరకు తక్కువగానే ఉంది. ఇదేమి ఇన్ఫోసిస్‌కు భారతదేశంలో ఉన్న నెంబర్ 2 స్దానం మీద ప్రభావం చూపిస్తుందని మేము అనుకోవడం లేదని ఎరిక్ లిన్(మేనేజర్ ఇండియా ఫండ్) తెలిపారు. ఇన్ఫోసిస్ కంపెనీ 1981లో ఏడుగురు ఇంజనీర్స్ $250తో ప్రారంభించి రూ 18.2 మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించినటువంటి రోజులు చాలా ఉన్నాయి.

ఇక ఈ సందర్బంలో ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వి బాలకృష్ణన్ మాట్లాడుతూ మార్జిన్స్ విషయంలో ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. ఇక్కడ మనం ఒత్తిడి ధర, రూపయిలతో కలసి పని చేయాల్సి వస్తుంది. మార్జిన్స్ ఒత్తిడి వల్ల మేము అనుకున్నంత లాభాలు సాధించడంలో మేము కొంత విఫలం అయిన మాట వాస్తమేనని అన్నారు.

English summary
Infosys Technologies Ltd, India's No. 2 software services exporter, sparked worries about the sector after it forecast annual revenue lower than expectations amid a slowdown in client spending, knocking shares down more than 7 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more