వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత పద్మనాభ స్వామి ఆరో గది మర్మం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantha Padmanabha Swamy Temple
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అంతులేని సంపదతో వార్తల్లో నిలుస్తోంది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో సుమారు ఐదు లక్షల కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. వాటి విలువ అంత ఉండదని ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నప్పటికీ ఆ సంపద విలువ భారీగానే ఉంటుందనే వారూ ఉన్నారు. ఈ ఐదు నేలమాళిగలలో కంటే ఆరోగదిలో ఇంతకంటే ఎక్కువ సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆరో నేలమాళిగ తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం ఆరోనేల మాళిగను తెరవడానికి సిద్ధమైన సందర్భంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా గురువారం రోజు సుప్రీంకోర్టు ఆరో నేలమాళిగ విషయంలో తమ ఆదేశాలు జారీ చేయనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు కోసం ఇటు కేరళ ప్రభుత్వం, అటు భక్తులు సైతం వేచి చూస్తున్నారు.

ఆరో నేలమాళిగకు నాగబంధం ఉందని దానిని తెరవకూడదని అది తెరిస్తే అరిష్టం అని భక్తులు హెచ్చరిస్తున్నారు. అయితే హేతువాదులు మాత్రం అది తెరవాల్సిందే అని పట్టుపడుతున్నారు. ప్రభుత్వం గానీ, కోర్టులు గానీ తెరవడానికి సిద్ధంగా లేకుంటే తాము దానిని తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు హేతువాదులు చెబుతున్నారు. ఇప్పుడు పలువురిని పలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఆలయం వాస్తు నిధిని సూచిస్తుందా, ఆరో నేలమాళిగకు నాగబంధం ఉన్న నేపథ్యంలో దానిని తెరవగలికే వ్యక్తి ఎవరు, నాగబంధాన్ని చేధించే అస్త్రం సుప్రీంకోర్టు వద్ద ఉందా, ఏ ధీమాతో నాగబంధం చేధించాలనుకుంటున్నారు. నాగబంధాన్ని తెరిస్తే నష్టం అంటున్న ట్రావెన్ కోర్ వంశీయుల వ్యాఖ్యలు నిజమవుతాయా?
ఇలా భక్తులు తెరవద్దనడం, హేతువాదులు తెరవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుంది. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

పూర్వాకాలంలో రాజులు నిధులను భద్రంగా ఉండటం కోసం ఆలయాల్లో దాచే వారని తెలుస్తోంది. ఆలయాల్లో అయితే దేవుడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో దొంగిలించడానికి భయపడతారనే ఉద్దేశ్యంతో రాజులు ధనాన్ని ఆలయాల్లో భద్రపరిచే వారని తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బారీ సంపద దొరికిన నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు దేవాలయాలపై పడినాయి. ఇటీవల మన రాష్ట్రంలో ఓ శివాలయంలో గుప్త నిధుల కోసం పలువురు తవ్వకాలు సైతం జరిపారు. తిరువనంతపురంలో భారీగా నిధులు బయడపటడంతో మన రాష్ట్రంలోని అనంతపద్మనాభస్వామి ఆలయంపై సైతం పలువురి దృష్టి ఇప్పటికే పడింది. మతవిశ్వాసాలను, హేతువాదులను పక్కనపెట్టి ఆరోగదిని తెరిచి అనంత పద్మనాభ స్వామి పేరుమీదనే కార్యక్రమాలు చేపడితే ప్రజాధనం వృధాకాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Supreme Court reveals their justice today on Anantha Padmanaba Swamy temple's sixth room.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X