అందరిని అలరించే నవరాత్రి పండుగ!

మాత ఆశీస్సులకై భక్తులు మాతకు టెంకాయలు, పండ్లు, పూవులు పుష్కలంగా సమర్పిస్తారు. ఈ పండుగను ఇండ్లలోను, దేవాలయాలలోను కూడా జరుపుతారు. కొత్త బట్టలు ధరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దాండియా(కోలాటం), డప్పు వాయిద్యాలు, రకరకాల వేషాలతో మాతకు ఊరేగింపులు చేస్తారు.
నవ రాత్రులలో చివరి మూడు రోజులు ప్రధానమైన పండుగలుగా పరిగణించబడతాయి. వీటిని దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలుగా చెపుతారు. పండుగ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఆచరిస్తారు. అయితే అందరికి ఈ పండుగలో ప్రధాన పూజా దేవత దుర్గా మాత. తొమ్మిది రోజుల పండుగ, దుర్గా మాత విగ్రహాలను విజయదశమినాడు నీటిలో నిమజ్జనంచేయడంతో ముగుస్తుంది. పదవ రోజున చెడును అంతం చేసే సంకేతంగా రావణాసురుడి గడ్డిబొమ్మలను తగులబెట్టి, పటాకులు కాల్చటంతో పండుగ ముగిస్తారు.












Click it and Unblock the Notifications