వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారలను నిండా తడిపేసి, ఆపై...!

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

సినిమాల్లో వాన పాటలకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. తడిసిన అందాలతో హీరోయిన్లు ఆడి పాడుతుంటే...తెగ ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ వాన పాటల జోరు ఈ నాటి కాదు. ఎన్టీ రామారావు కాలం నుంచే ఈ వాన పాటలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇప్పుడంటే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కానీ.. అప్పట్లో దాదాపు ప్రతి సినిమాలోనూ వాన పాటలు ఉండేవి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం కొందరు దర్శకులు ప్రత్యేకించి ఇలాంటి పాటలను పెట్టించే వారు. అయితే ఈ పాటలను చిత్రీకరించడం అంత ఈజీ ఏం కాదు. చిత్రీకరించేటప్పుడు దర్శకులు, పాట చిత్రీకరణ తర్వాత తారలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారు. మరి అన్ని కష్టాలు పడితే తప్ప తెరపైకి రొమాంటిక్ రెయిన్ సాంగ్ వచ్చేది కాదు.

శృంగార రసం ఒలికించడానికి పాట చిత్రీకరణలో తడిసి ముద్దయిన నాయికలు...అప్పడప్పుడు జారి పడే వారట. నీళ్లలో చాలా సేపు తడవటం వల్ల జ్వరాజలు, జలుబులు వచ్చేవి వారికి. ఇక నీళ్లు శుభ్రంగా లేకుంటే దురదలు, ఇన్ఫెక్షన్లు సరేసరి. తొలి నాళ్లలో ఇలాంటి చాలా ఉండేవి. ఆ తర్వాత తరం దర్శకులు ఇలాంటి జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాన పాటల్లో వాళ్లు వేసే డ్రెస్సులను స్పెషల్ గా ఎంపిక చేస్తారు. హీరోయిన్ల బాడీలో ఏయే పార్టులు కనిపించాలో, ఏవేవి కినపించ కూడదో ముందు చెప్పి అలాంటి దుస్తులను కుట్టిస్తారట.

ఇదంతా ఒక ఎత్తయితే....కృత్రిమంగా వర్షం ఎఫెక్టును తీసుకు రావడం మరో ఎత్తు. అందుకే ఇలాంటి పాట చిత్తీకరణ బాగా నీళ్లు అందుబాటులో ఉండే ప్రదేశాల్లోనే పెట్టుకుంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో నీళ్లు ఫ్రీగా అస్సలు దొరకవు. డబ్బులిచ్చి ట్యాంకర్లలో తెప్పించుకోవాలి. వేసవిలో ఇలాంటి సీన్ల చిత్రీకరణ అయితే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. నీళ్లు సమకూరాక పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నాజల్స్ బిగింస్తారు. ఈ నాజల్స్ వల్లనే వర్షం పడిన ఎఫెక్టు వస్తుంది. ఇన్ని కష్టాలు పడిన తర్వాత...తెరపై చిటపట చినుకులు రాలుతాయి. ఆ చినుకుల్లో అందాల గుమ్మలు తమ సొగసులను ఆరబోస్తూ ప్రేక్షకులకు విదోదాన్ని పంచుతారు. అదీ సంగతి.

English summary
Rain songs in films will make people to enjoy, but the shootong of those scenes will have many problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X