వైయస్ జగన్ కేసు: ఎవరీ సుఖేష్ గుప్తా?

జగన్ సన్నిహితులను, రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, వ్యాపార భాగస్వాములను పిలిపించి సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇటీవల సుఖేష్ గుప్తాను సిబిఐ విచారించడం ఆసక్తికరంగా మారింది. శతాబ్ద కాలంగా సుఖేష్ గుప్తా కుటుంబ సభ్యులు హైదరాబాదు కేంద్రంగా ముత్యాలు, బంగారం, వజ్రాలు, రూబీల వ్యాపారం చేస్తున్నారు. సుఖేష్ గుప్తాకు చెందిన ఎంబియస్ సంస్థ హైదరాబాదు శివారులో విలువైన భూములను తాకట్టు పెట్టి రూ. 600 కోట్లకు పైగా రుణార్హతను పొందినట్లు తెలుస్తోందంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.
ప్రముఖ దినపత్రిక వార్తాకథనం ప్రకారం - సుఖేష్ గుప్తా హైదరాబాదులోని కింగ్ కోఠీ ప్యాలెస్‌కు సమీపంలో నివాసం ఉంటున్నారు. సుఖేష్ గుప్తా దాదాపు 24 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. వీటిలో కొన్ని స్టాక్ ఎక్స్‌ఛేంజీలో నమోదయ్యాయి. ఎంబియస్ జ్యువెల్లరీస్‌లో జగన్‌కు కూడా వాటాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలోనే సిబిఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
సుఖేష్ గుప్తా హైదరాబాదు నగరం శివారులోని విలువైన భూములను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఇలా భూములను తాకట్టు పెట్టి సుఖేష్ గుప్తా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (కార్పొరేట్ శాఖ), ఆంధ్రా బ్యాంక్ ( సోమాజిగుడా), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (హిమాయత్‌నగర్) నుంచి ఎంబియస్ రూ. 550 కోట్ల మేరకు రుణార్హత పొందినట్లు ఆ పత్రిక రాసింది. ఇందులో కొంత ఎంబియస్ జ్యువెల్లరీస్ తీసుకుంది. ఇలా సుఖేష్ గుప్తా కంపెనీలు 2007లో భూములు తాకట్టు పెట్టి రూ. 103.50 కోట్ల రుణాన్ని తీసుకున్నట్లు ఆ పత్రిక రాసింది. ఈ వ్యవహారాల్లో వైయస్ జగన్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో సిబిఐ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం.












Click it and Unblock the Notifications