కొత్త అర్థాల అధ్యాయం 'క్లిక్' మంది పార్ట్-2
రెండు నేత్రాలతో చూసి జీవిత కథనాలు రాసే రమేష్, ఒక కన్ను మూసి మరో కన్ను లెన్స్‌లో తెరిచి చూస్తున్నాడు. అందుకే ప్రతి ఫోటో ఒక సామాన్యశాస్త్ర గ్రంథమే అయ్యింది.
పై వర్గాలలో, నగర విప్లవ మెదళ్లలో కనిపించని నిష్కల్మషత, నిష్కాపట్యం, నిజాయితీ, దీక్షా దక్షతలు సామాన్యుల సాధారణ లక్షణం అని ఈ బొమ్మలు చెబుతాయి.

ఈ ఫోటోలలో వాళ్లు సన్న జీవాలు కాదు. వారిని అలాగా జనం లాంటి మాటలు అనబుద్ది కాదు. పైగా అలా అనడం నేరం అనిపిస్తుంది. పరిపూర్ణ మనస్కతకి, నిండు హృదయానికి సంకేతాలు ఆటపట్టులు.
అందుకే రమేష్ అంటాడు - ''ఫోటోలో పిల్లాడి ఏడ్పు ఆగకుండా వినొస్తుంటుంది. పొగ ఊదే దృశ్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఊదే శబ్దం వెంటాడుతుంది''. అవును. ఈ ఫోటోలు చూసిన వాళ్లని ఫోటోల్లోని బతుకులు వెంటాడుతాయి. వాళ్లు సంధించని ప్రశ్నల వంటివారు. ఐనా ఏదో ఒక జవాబు. ఇచ్చుకోవడానికి ప్రయాసపడటం మన పని అవుతుంది.
మొత్తానికి ఫోటోల్లో ఒక 'కదలిక' మనని వెన్నంటే వస్తుంది. అది బతుకు కదలికా. సమాజం కదలికా? పని చేసే బదులు, కదిలే బైక్, సడక్ పైన వేగంగా కదిలే మనుషులు.... ఫోటోలు చూస్తూ కదిలే మనం... లెన్స్ క్లిక్ కొట్టే కదలిక, చప్పుడు మనని ఎక్కడో కుదిపి కదిల్చే పడేస్తుంది.
ఈ ఫోటోలు నాన్ ఫిక్షన్‌లా లేదా డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. కాని ప్రతి ఫోటోలోని మనిషో, గోడమీది బొమ్మో మనని నిలబెట్టి తన కథ - ఆత్మకథ, ఫ్యాక్షన్‌లా అనిపిస్తుంది. పాకే పురుగు, అరిచే కుక్క, పిల్లి, పాము ఏదైనా కావచ్చు. అవి సమాజంలో విడదీయరాని బతుకులే. అవి ఆవరించని నేల లేదు కదా.
ఎగ్జిబిషన్ చూసి వస్తుంటే - ఈచిత్రాలలోని ప్రతి మనిషికి కథ ఉంది. అస్తిత్వం ఉంది. వాళ్లు మాట్లాడితే ఒక్కో జీవిత చరిత్ర అవుతుంది. దాన్ని మరచిపోవద్దు అన్నాడు రమేష్.
సామాన్యుల ఉత్సవంలో ఓ మహాశ్వేతా దేవి, విఖ్యాత రచయిత జాన్ మర్దాల్, రఘురాయ్, కొండపల్లి, శేషగిరిరావు, గద్దర్‌లు ఉన్నారు. కానీ వీళ్లంతా సామాన్య జీవుల సరసనే నిలిచారు. కలకత్తా, ఢిల్లీ, హైదరాబాదు.. ప్రాంతం ఏదైతేనేం ఒక భారతీయం కనిపిస్తోంది.
మాబ్, మాస్, గుంపు ఇవి డెరాగేటరీ పదాలు. ఈ పదాలలోంచి ఫోటోలను చూడవద్దు. మనుషుల మధ్య, పరిసరాల మధ్య కనిపించే సామూహికత, సహభావన, సామరస్యత గొప్ప రిలీఫ్ ఇస్తుంది. రాజన్ బాబు ఛాయాచిత్ర కళాత్మకత, భారత్, బ్లూల వైవిద్యం, రఘురాయ్ ఇతివృత్త కోణం, రమేష్ బాబులో బలంగా తొంగి చూస్తాయి. అతని రాతల్లోని సామాన్యశాస్త్రం పొడిగింపబడి, ఒక కొత్త ఛాయాచిత్ర శాస్త్రం పునాదులు కూడా గోచరమవుతాయి. ప్రకృతి రమణీయత పక్కనే అందమైన రాలిన పూల గోస కనిపిస్తుంది. ప్రకృతి ఈ దృశ్యాల్లో కొత్త అర్థంలో వ్యక్తం అవుతుంది. నిజంగా ఇలా కూడా ఫోటోలు తీయవచ్చా అని తలపండిన వాళ్లు సైతం అబ్బురపడతారు. ఇలా అబ్బురపరచడమే కళేమో. ''విస్మయానంద ఆలోచన'' కలిగించే గుణం రమేష్ ఫోటోల సహజ లక్షణం.
ఫోటో తీశాక అందులోని కొన్ని అంశాలను రమేష్ తీసేయడు. ఇవ్వన్నీ ఆ ఫోటోలీని వ్యక్తుల సంబంధాలు. అవినాభావ ఆత్మీయ పేగు బంధాలు. వాటిని తీసేయడానికి నాకు హక్కు లేదు. అది వాళ్ల సొంతం అంటాడు.
సాధారణంగా ఛాయా చిత్ర గ్రాహకుడు ఫోటోని క్రాఫ్ చేస్తాడు. కచరాని తీసి శుభ్రం చేస్తాననుకొని ఫోటోలోని జీవ కణాలని తొలగిస్తారు. నేను అలాకాదు. ఆ కచరానే, ఆ కోణాలనే అభిమానిస్తును. అదంతా జీవితంలో ఒక భాగం. సగభాగం. దాన్ని గౌరవించడం నేర్చుకుంటే ప్రజలను అభిమానిస్తాం. వీటన్నింటి సమాహారమే జీవితం. కళ పేరుతో జీవితాన్ని కత్తిరించకూడదంటాడు రమేష్. ఫోటోలో ఫోటోగ్రఫీకి అడ్డొచ్చే ఎలాంటి వాటినైనా తొలగించను. వాటిని చూపడమే నా ఫోటోగ్రఫీ అంటాడు.
అందుకే అత్యాధునిక కంప్యూటర్‌ని ఉపయోగించి మోసం చేయను. కళాత్మక విలువల పేరుతో బొడ్డు తాడుని కనుమరుకు చేయను. కప్పిపుచ్చడం కన్నా విప్పి చూపడమే నా లక్ష్యం. ఒక్కసారి క్లిక్ మన్న తర్వాత అది సమాజానిది. దాన్ని మార్చే అధికారం లేదు. ఏ నియంతకూ ఉండకూడదు. కళ కాకపోతేనేం. అది బతుకు. బతుకు తీపిలో భాగం.
ఫోటోలు చాలా తీశాను. తీసిన వాటిలో కొన్నింటిని ఒక చోట పోగేశాను. ఇది నా ఆరంగేట్రం. ప్రదర్శన ఇరవై ఒఖ్క రోజులు అంటే 31 ఆగస్టు వరకు ఉంటుంది. జీవితం ముందు రాజకీయ ప్రకటనలు చాలాసార్లు వెలవెలపోతాయి. నాకో బ్రాండ్ వేయాలని చూస్తారు. నాకో పేరు పెట్టాలనైనా చూస్తారు. ఎవరి కోణం వారిది. నాది లెన్స్ దృక్కోణం.
ఈ ఫోటోలు తీసేముందు నా ముందున్న సబ్జెక్ట్‌తో మమేకం అవుతాను. తీశాక నన్ను నేను చూసుకుంటున్నాను. మీరు అందులో ఎక్కడో ఓ దగ్గర కనిపిస్తారు. మీకంటే విస్పష్టంగా మరచిపోయిన మిమ్మల్ని మీరు వెతుక్కోవచ్చు. కోల్పోయిన ధీమాని స్పర్షించవచ్చు. తప్పిపోయిన అక్కనో, తమ్ముణ్నో ఆలింగనం చేసుకోవచ్చు. మనదైన ఆత్మకి ఒక ప్రతిబింబం ఉంటే బాగుండు అనుకునే వాళ్లకి ఇదొక అవకాశం. కష్టపడి పుస్తకాలు చదివే శ్రమ అవసరం లేదు. డబ్బులు పెట్టి కొనుక్కునే అగత్యం లేదు. హాయిగా ఎవరితోనూ మాట్లాడకుండా మనతో మనం చెట్టాపట్టాలు వేసుకోవచ్చు. కాకపోతే కొంత సమయం వెచ్చించాలి. అవును. సమయానికి బలైన జీవులని తట్టిలేపే పరుషవేది ఇంకా ఎవరూ కనుక్కోలేదు. కాకపోతే కాస్త మనిషితనం ఎక్కడో మిగిలిన వాళ్లు తాము ఈ మనుషుల్లో ఒక భాగం అని తెలుసుకోవడం కోసం ఈ బొమ్మలు చూడాలి.
ఈ బొమ్మల్లో సాహిత్యం ప్రక్రియల్లో కనిపించని సామాన్య శాస్త్రపు కొత్త కోణాలున్నాయి. కెమెరా కన్నునీ, కుంచెనీ, కవిత్వాన్ని జమిలిగా మలిచిన అలిశెట్టి ప్రభాకర్ 'చూపు'కి తగలని లోతులు కొన్ని కనిపిస్తాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications