వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అర్థాల అధ్యాయం 'క్లిక్' మంది పార్ట్-3

By Pratap
|
Google Oneindia TeluguNews

కొన్ని ఫోటోల గురించి చూద్దాం.

ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం దాని ముందు పల్లీలమ్మే తల్లి. తలపై చుట్ట కుదురు. కింద దించిన పల్లీల బుట్ట. చదువు పొట్ట పోసుకోవడానికే అనే కాలం ఇది. చదువు దాని తల్లి చేస్తున్న దదే ఈ తల్లి తన కొడుకుని ఇక్కడే చదివిస్తుంటుంది. ఏ విశ్వవిద్యాలయం ప్రదానం చేయని చుట్ట కుదురు. స్నాతకోత్సవం రోజు తలప ఉంచిన టోపీ తలపిస్తుంది. ఉ్నత విద్యను, పల్లీల బుట్టకీ ఒక తెలియని సంఘర్షణ లేదా అనుబంధం వంటిది ఏదో ఆలోచన మనల్ని ముప్పిరి గొంటుంది.

Photography Exhibition

బెలూన్ బుగ్గలు అమ్మే ఆయన వెనక ఆనందంతో తబ్బిబ్బు అయిన పిల్ల పాలబుగ్గలు - బుగ్గలు కొనివ్వని అశక్తుడైన తండ్రి. ఇదీ అని చెప్పలేని ఒక బతుకు దృశ్యం. ఇంతవరకు జీవితంలో ఎవరూ స్పృశించని ఒక కోణం.

ఫొటో ఫీచర్ చూడండి

ఒక జలాశయాన్ని ఆనుకొని ఉన్న ఎండిన మోడులు కొన్ని. వెనకపక్క పచ్చని చెట్లు. ఆ పక్కనే మరో ఫోటోలో అతి పెద్ద చిగురిస్తున్న మోడు. సమ్మక్క సారక్కల జాతర. దగ్గర భయం కొలిపే మోడు. మోడులు వాస్తవం. వాస్తవాన్ని విస్మరించడం పాపం కదా.

మరో ఫోటోలో అడవి జింకలు బొమ్మలు బిజీ రోడ్డు మీద. నడుస్తున్న బొమ్మల్లా మనుషులు. అడవి రోడ్డు, వన్య ప్రాణీ, మనిషి.. బొమ్మలు చేసి బతుకు ఈదే మనిషి రోడ్డు వారన. ఎవరూ పట్టించుకోని కళ. బతుకుని ఈడ్చే కల.

ఇటుకల సపోర్టు. మధ్య వెదురు బద్దకి తగిలించిన అట్ట. దానిపై అప్పుడే మరణించిన సిహెచ్.పెంటమ్మ ఫోటో. ఆమె మరణించినందుకు కూడలి సంతాపం.

మరో ఫోటోలో ఎక్కడ నుండో జారిపడిన కళాకారుడు. దీన వదనంతో కూర్చున్న గూడు కట్టుకున్న అతని చేతుల్లో చర్మ వాద్యం మరింత దీనంగా. జానపద కళా విషాదం ఆ బొమ్మ నిండా నిండిపోయింది. విషాదమే కాదు దాన్ని జయించిన విజయధ్యానం కూడా ఫోటోల్లో కనిపిస్తుంది. ఒక గెలిచిన జీవిత రహస్యం వెంటాడుతూ మననంటి వస్తుంటుంది.

ఒకటిన్నరేళ్లు మా మనుమరాలు జైత్ర ఆ బొమ్మల్లోని పేర్చిన గాజులనీ, మనిషి బతుకుతో సగోరించే శునకాన్నీ, కట్టలు కట్టే అమ్మకానికి ఉన్న నెమలీకల్ని, కోఠిలోని గూడులోని పావురాల గుంపుని, వయసు మళ్లిన నాలాంటి తాతల్ని గుర్తిస్తూ నాతో పాటే ఫోటో ఎగ్జిబిషన్ చూసింది. తన అతి చిన్న జీవితంలో తారసపడిన, తనకు తెలిసిన వస్తువులను, జీవితాల్ని గుర్తించి వాటితో మమేకమైంది.

మనం సిద్ధపరిచిన కళాత్మక విలువల నిర్వచనంతో బాల్యాన్ని పరిహరించాం. కళ పెద్దలకే. కలిగిన వాళ్లకే. ఇవేవీ తెలియని బాల్యాన్ని కూడా ఆ ఫోటోలు పలకరించాయి. వాటిని పలకరిస్తూనే ఆ చిన్నారి నిద్రపోయింది. కళ తనని కూడా స్వీకరించినందుకు పరవశించింది.

కళ పరమార్థం స్థల కాలాలను జయించడమే. నిరక్షరాస్యులైనా, పండితులైనా వాటి ముందు ఒక్కటే. అందుకే 'దృశ్యం' గొప్పది. సజీవ బతుకు బొమ్మే కళ. కళకి కొత్త అర్థాల అధ్యాయం ఒకటి తెరుచుకుంది.

- జయధీర్ తిరుమలరావు

English summary
An eminent critic of art and literature Jayadhir Tirumala Rao analyses Kandukuri Ramesh Babu's photography exhibition, which was opened for audience at Hotel Marriott near Tankbund in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X