• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫొటో ఫీచర్: దేవీ అలంకారాలు,నివేదన (దసరా స్పెషల్)

By Srikanya
|

హైదరాబాద్ : దేవీ నవరాత్రులలో దేవీ అలంకారాలు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. దేవీ వివిధ అవతారాలకు ప్రతిరోజు ప్రసాదం (నివేదన) విభిన్నంగా ఉంటుంది. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు. విజయదశమి పేరున చేసుకునే ఈ పండుగ ఆశ్వీయుజ మాసంలో వస్తుంది ఆశ్వయుజ శుద్ధపాడ్యమితో ప్రారంభమై తొమ్మిది రోజులూ మంత్ర దీక్షతో దేవీ నవరాత్రులు జరుపుతారు. శరదృతువులో వచ్చే ఈ దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రులు అని కూడా అంటారు.

బాలాత్రిపుర సుందరి

బాలాత్రిపుర సుందరి

త్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.

తేది : 16.10.12 మంగళవారం ఆశ్వయుజ మాసం ప్రారంభం. దేవీ నవరాత్రులు ప్రారంభం. కలశస్థాపన. శుద్ధ పాడ్యమి చిత్త నక్షత్రం. బాలాత్రిపుర సుందరి అవతారం. (అలంకరణ) రంగులు : 1. రెడ్‌ 2. లైట్‌ రెడ్‌ 3. రెడ్‌ కలర్‌లో గ్రీన్‌ బార్డర్‌. నివేదన (ప్రసాదం) :1. చలిమిడి, 2. వడ పప్ప, పాయసం.

శ్రీ గాయత్రీదేవి

శ్రీ గాయత్రీదేవి

తేది : 17.10.12 బుధవారం ఆశ్వయుజ శుద్ధ విదియ స్వాతి నక్షత్రం. శ్రీ గాయత్రీదేవి అవతారం (అలంకరణ) కలర్స్‌ : 1. లైట్‌ ఎల్లో కలర్‌. నివేదన (ప్రసాదం) : శనగలు, తీపి బూందీ.

మహాలక్ష్మి

మహాలక్ష్మి

తేది : 18.10.12 గురు వారం ఆశ్వయుజ శుద్ధ తదియ విశాఖ నక్షత్రం. అవతారం మహాలక్ష్మి (అలంకరణ) కలర్స్‌ : గ్రీన్‌ కలర్‌ 2. గ్రీన్‌ మెరూన్‌ బార్డర్‌. నివేదన (ప్రసాదం) : క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది.

అన్నపూర్ణ దేవి

అన్నపూర్ణ దేవి

తేది : 19.10.12 శుక్రవారం. ఆశ్వయుజ చవితి జేష్ట నక్షత్రం. అన్నపూర్ణ దేవి అవతారం (అలంకరణ) కలర్స్‌ : 1. బ్లూ కలర్‌ 2. రెడ్‌ కలర్‌ 3. ఎల్లో కలర్‌ 4. ఎల్లో బార్డర్‌తో పింక్‌ కలర్‌. నివేదన (ప్రసాదం) : పొంగలి

 శ్రీ సరస్వతి

శ్రీ సరస్వతి

తేది : 20.10.12 శనివారం ఆశ్వయుజ పంచమి మూలా నక్షత్రం. శ్రీ సరస్వతి అవతారం (అలంకరణ కలర్స్‌ : 1. వైట్‌ కలర్‌ 2. వైట్‌ క్రీమ్‌ కలర్‌. ప్రసాదం (నివేదన) : శనగపప్పు, కొబ్బరి

 శ్రీ లలితాదేవి

శ్రీ లలితాదేవి

తేది : 21 .10.12 ఆది వారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి పూర్వాషాడ నక్షత్రం. శ్రీ లలితాదేవి అవతారం. కలర్‌ : 1. వైట్‌ పింక్‌ 2. వైట్‌ ఎల్లో 3. లైట్‌ ఎల్లో బార్డర్‌తో రెడ్‌. నివేదన (ప్రసాదం) : పులిహోర, పెసర బూరెలు

దుర్గాదేవి

దుర్గాదేవి

తేది : 22.10.12 సోమవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవి అవతారం, ఉత్తరాషాఢ నక్షత్రం. (అలంకరణ) కలర్స్‌ : 1. రెడ్‌ కలర్‌ 2. రెడ్‌లో గోల్డ్‌ కలర్‌ బార్డర్‌ నివేదన (ప్రసాదం) : గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం

శ్రీ మహిషాసుర మర్థిని

శ్రీ మహిషాసుర మర్థిని

తేది : 23.10.12 మంగళవారం ఆశ్వియుజ శుద్ధ నవమి శ్రవణ నక్షత్రం.శ్రీ మహిషాసుర మర్థిని అవతారము (అలంకరణ) కలర్‌ : బ్లాక్‌ కలర్‌ 2. చాక్‌లెట్‌ కలర్‌ రెడ్గ బాడర్‌ నివేదన (ప్రసాదం) : చక్రపొంగలి

శ్రీరాజరాజేశ్వరి

శ్రీరాజరాజేశ్వరి

తేది : 24.10.12 బుధవారం ఆశ్వయుజ శుద్ధ దశమి,ధనిష్ట నక్షత్రం. విజయ దశమి దసర పండుగ, శ్రీరాజరాజేశ్వరి అవతారం (అలంకరణ) కలర్స్‌ : కనకాంబరం కలర్‌ 2. లైట్‌ రోజ్‌ కలర్‌. నివేదన (ప్రసాదం) : గారెలు, పులిహోర.

విజయదశమి రోజునే శమీవృక్ష దర్శనం కూడా చేస్తారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందువల్ల ఆ మాతకు దుర్గ అని పేరువచ్చింది. అలాగే దుర్గమమైనది కనుక దుర్గ అని, దుర్గతులను తొలగించేది కనుక దుర్గ అని అంటారు. దుర్భిక్షాన్ని, దారిద్య్రాన్ని, నశింపచేసేది అనే అర్థంలో కూడా దుర్గామాత పిలుపులందుకుంటుంది. మార్కండేయపురాణం లాంటి పురాణాలలో నవదుర్గల ప్రస్తావన ఉంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా దేవి, కూష్మాండదేవి, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి,గౌరీమాత, సిద్ధిధ్రాత్రీ అనే పేర్లతో నవదుర్గలకు పూజలు జరుగుతాయి.నవరాత్రులలో అలంకారాలుగా చేసి అర్పించేటప్పుడు బాలా త్రిపురసుందరి, దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరి, లలిత అనేఅలంకారాలలో భక్తులు అర్చించుకుంటారు.

రాముడు కూడ దేవీ నవరాత్రులను దీక్షతో చేసి విజయదశమి నాడే రావణాసురుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడని అలా విజయదశమినాడు వెళ్ళినందువల్లనే అయనకు విజయం చేకూరిందని పురాణకథలు వివరిస్తున్నాయి. దసరా పండుగ తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతారు. స్త్రీలు ఇలా సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. పూర్వకాలంలో ఇప్పటికన్నా ఇంకా ఎంతో ఆనందంగా దసరా పండుగను జరుపుకుంటుండేవారు. ఆనాడు వీధి బడులలోని పిల్లలంతా అయ్యవార్లవెంట నడుస్తూ ఊరు ఊరంతా తిరుగుతూ దసరా పద్యాలు, పాటలు పాడుతూ ఉత్సహంగా కాలం గడిపేవారు. ఇలా దసరా పండుగ భక్తిని, ఉత్సాహాన్ని సమపాళ్ళలో కలిగిస్తూ ఆనందాల సంబరంగాఅవతరిస్తుంటుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Navaratri is a nine night festival that honors the Mother Goddess in all her manifestations, including Durga, Lakshmi and Saraswati. It's a festival full of worship and dance. The festival culminates with Dussehra, the victory of good over evil, on the tenth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more