ఎపి: స్త్రీలపై రేప్‌లు తక్కువ, వేధింపులు ఎక్కువ

దేశంలో మహిళపై జరిగిన నేరాల్లో పది శాతం హైదరాబాద్, విజయవాడలను కలిపి పదిశాతం జరిగాయి. దేశంలో మహిళలకు భద్రత లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైంది. బ్యూరో లెక్కల ప్రకారం - రాష్ట్రంలో 2012లో మహిళలపై జరిగిన నేరాలు 28,171 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌పైన ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో 30,942 కేసులు నమోదయ్యాయి. నగరాలను లెక్కలోకి తీసుకుంటే హైదరాబాదులో 1,899 కేసులు నమోదు కాగా, విజయవాడలో ఒక్కటి తక్కువగా 1,898 కేసులు నమోదయ్యాయి.
ఈ నగరాల కన్నా పైస్థానంలో ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూర్ ఉన్నాయి. మహిళల పట్ల జరిగే నేరాల్లో అత్యాచార నేరాలు తక్కువే ఉన్నాయి. చాలా కేసులు మహిళలను భర్తలు, బంధువులు వేధించినవే. ఈ కేసుల విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. భర్తలు, బంధువులు దాడి చేసిన కేసులు రాష్ట్రంలో 13,389 నమోదు అయ్యాయి. ఈ విషయంలో కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ కన్నా ముందుంది.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 40 శాతం ఉన్నాయి. మహిళలపై దాడి కేసులు పది శాతం ఉన్నాయి. మధ్యప్రదేశ్ మాత్రమే ఈ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఉంది. అక్రమ మనుషుల రవాణా కేసులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువే. ఇటువంటి కేసులు 472 నమోదయ్యాయి. తమిళనాడులో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇటువంటి కేసులు 500 నమోదయ్యాయి. వరకట్నం వేధింపుల కేసులు కూడా రాష్ట్రంలో ఎక్కువే ఉన్నాయి.












Click it and Unblock the Notifications