మట్టి వినాయకులను పంచుతూ అమల (ఫొటోలు)
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో గణేష్ ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంగా ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగర పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల్లో ప్రజలు మట్టి విగ్రహాలు ఉపయోగించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతోంది.
మట్టి వినాయక విగ్రహాల తయారీకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మల్కాజ్ గిరి సంక్షేమ సంఘాల సమాఖ్య సంయుక్తంగా మట్టి విగ్రహాల ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రజలకు మట్టి నాయక విగ్రహాలు అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల యాజమాన్యాలు కూడా జంట నగరాల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చాయి. వినాయకుడి మట్టి విగ్రహాలను సినీ నటి, నాగార్జున సతీమణి అమల చేతుల మీదుగా పంచిపెట్టారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేయడిన విగ్రహాలు నగర పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున మట్టి విగ్రహాలు ఉపయోగించాలని నగర పాలక, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కోరుతున్నాయి. హుస్సేన్ సాగర్ కాలుష్యానికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలపై ఉందన్నాయి. పర్యావరణ అనుకూల విగ్రహాలు ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తోడ్పడాలని కోరుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. కాలుష్య రహిత రంగులను విగ్రహాలకు ఉపయోగించాలని ఏపీ పీసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. నగరంలో పెరుగుతున్న విగ్రహాల సంఖ్యను తగ్గించేందుకు సామూహికంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందువల్ల నగరంలోని జలాశయాల్లో నిమజ్జనం ప్రక్రియ కూడా సులభంగా కొనసాగుతుందని అంటున్నారు.

మట్టి గణేశులకు ప్రాధాన్యం
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (హెచ్ఎండిఎ), స్వచ్ఛంద సంస్థల ప్రచారంతో నగరంలో మట్టి వినాయకులకు గిరాకీ పెరిగింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను మాత్రమే వాడాలంటూ హెచ్ఎండిఎ ప్రచారం సాగిస్తూ వస్తోంది.

మట్టి వినాయకుల ప్రాధాన్యం వివరిస్తూ..
హైదరాబాద్ నగరపాలక సంస్థ మట్టి వినాయకుల పంపకాన్ని ప్రారంభించింది. మట్టి వినాయకుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా ప్రచారం...

విగ్రహాల పంపిణీ
హెచ్ఎండిఎ మట్టి గణేశుడి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. కొన్ని విగ్రహాలను సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తోంది. కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలనే చైతన్యాన్ని పెంచడానికి పూనుకుంది.

మట్టి వినాయకుడిని ఆహ్వానిస్తూ..
ప్రజలు కూడా మట్టి వినాయకుల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వినాయకుడి మట్టి విగ్రహాలను ఇలా అందుకుంటున్నారు.

మట్టి వినాయకులే మంచిది..
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు.

మట్టి విగ్రహాలే ముద్దు...
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేయడిన విగ్రహాలు నగర పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున మట్టి విగ్రహాలు ఉపయోగించాలని నగర పాలక, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కోరుతున్నాయి.

రావయ్యా గణపయ్యా..
వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రజలు ఆహ్వానించడానికి ముందుకు రావడం హర్షదాయకం. మట్టి విగ్రహాల జోరు గతంలో కన్నా ఈసారి హైదరాబాదులో పెరిగింది.












Click it and Unblock the Notifications