ఆ బాధను అబ్బాయిలు తట్టుకోలేరు.. అణు యుద్ధాలే జరుగుతాయ్ - పెద్ది బ్యూటీ

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అంతే కాకుండా దేవర సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ సరసన "పెద్ది" సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీలో ఈ బ్యూటీ పాత్రపై గట్టిగానే ట్రోల్స్ వచ్చాయి.

bollywood-actress-jahnvi-kapoor-shocking-comments-on-periods-to-boys-got-full-viral-on-social-media

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ, ఇంటర్వ్యూ లలోనూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు తనదైన శైలిలో సొసైటీలో జరిగే పలు విషయాలపై స్పందిస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా పీరియడ్స్ గురించి గతంలో నోరు విప్పింది. సున్నితమైన అంశం అయినప్పటికీ.. సభ్య సమాజం ఈ విషయాన్ని చూసే దృష్టి కోణంలో కొంత మార్పు రావాలని కూడా పలువురు కామెంట్స్ చేశారు. ఈ తరహా లోనే స్టార్ హీరోయిన్ అయిన జాన్వీ ఇలా ఓపెన్ గా మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరని అన్నారు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారని.. పీరియడ్స్ టైమ్ లో మూడ్ స్వింగ్స్ వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకే తాను మాట్లాడే విధానాన్ని బట్టి చాలా మంది.. ఇది నీకు ఆ సమయమా అని అడుగుతారని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ చాలా బాధగా ఉంటుందని.. దాన్ని కొందరు చులకనగా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ బాధను తట్టుకోలేరని జాన్వీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అప్పుడు మా బాధ ఏంటి అనేది వారికి అర్థం అవుతుందని.. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే కచ్చితంగా అణు యుద్ధాలే జరిగేవని తెలిపింది. దీంతో ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు మళ్లీ వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+