వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ ఖల్ నాయక్, మున్నాబాయ్ సంజయ్ దత్‌కు అనూహ్యమైన దెబ్బ తగిలింగి. 1993 బొంబాయి బాంబు పేలుళ్ల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.

1993 బొంబాయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాకూబ్ మెమెన్‌కు మరణశిక్ష విధించింది. ఇతర పది మంది దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 1993 మార్చి 12వ తేదీన బొంబాయి (ఇప్పటి ముంబై)లో వరుసగా 13 బాంబు పేలుళ్లు సంభవించాయి.

వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. టాడా కింద 129 మందిపై అభియోగాలు మోపారు. అయితే, 100 మందిని మాత్రమే కోర్టు దోషులుగా గుర్తించింది. బొంబాయి బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం కుట్ర చేసినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది.

పేలుళ్లకు పాల్పడినవారికి పాకిస్తాన్ ఐఎస్ఐ తర్ఫీదు ఇచ్చింది. పాకిస్తాన్‌లో దోషులు శిక్షణ పొందారని సుప్రీంకోర్టు తేల్చింది. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమెన్ ఈ కేసులో పరారీలో ఉన్నారు.

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని సంజయ్ దత్ చెప్పారు. తన కోసం ప్రార్థనలు చేయాలని ఆయన అందరినీ కోరారు. దేవుడు గొప్పవాడని సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్నారు.

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

తీర్పు వెలువరించే సమయంలో సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ సుప్రీంకోర్టులోనే ఉన్నారు. తీర్పు వెలువడిన తర్వాత ఆమె ఏడ్చేశారు.

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

తీర్పుపై ప్రతిస్పందనను అడగ్గా - తాను మాట్లాడదలుచుకోలేదని, ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని తీవ్ర విచారానికి లోనైన ప్రియా దత్ అన్నారు.

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

1993 బొంబాయి పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. యాకూబ్ మెమెన్‌కు మరణశిక్ష విధించింది. మరో పది మంది దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

పిక్చర్స్: మున్నాబాయ్, బొంబాయి పేలుళ్లు

పాకిస్తాన్ ఐఎస్ఐ ఆలోచనల మేరకే బొంబాయి పేలుళ్ల కుట్రకు పునాది పడిందని అంటారు. పేలుళ్ల వెనక దావూడ్ ఇబ్రహీంతో పాటు అతని అనుచరులు టైగర్ మెమొన్, అయూబ్ మెమొన్, యాకూబ్ మెమొన్ ఉన్నారు.

English summary
In a major setback for Sanjay Dutt, the Supreme Court on Thursday, March 21 upheld TADA Court's order and delivered its verdict following which the Bollywood actor now has to spent three and half years behind the bar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X