వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ కన్నా మిన్న: ఆసియా బిజినెస్‌మెన్స్ టాంగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Taiwanese Billionaire Establishes Richer than Nobel Prizes
ప్రఖ్యాత నోబెల్ ప్రైజు కన్నా మిన్న ఐన ఓ బహుమతిని ఇవ్వాలని అసియాకు చెందిన తైవాన్ వ్యాపారవేత్త శ్యామ్యూల్ యిన్ నిర్ణయించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి నోబెల్ పురస్కారాలు ఇస్తుంటారు. నోబెల్‌కు ధీటుగా టాంగ్‌ను ప్రవేశ పెట్టేందుకు యిన్ సిద్ధమయ్యారు. నోబెల్ విజేతలకు రూ.6.6 కోట్లు ఇస్తారు. యిన్ నెలకొల్పే టాంగ్ బహుమతి విజేతలకు రూ.9.35 కోట్లు ఇస్తారు.

ఈ విషయాన్ని రెంటెక్స్ గ్రూప్ అధినేత యిన్ స్వయంగా ప్రకటించారు. క్రీ.శ. 618-917 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలనలో ఉన్న టాంగ్ వంశస్థులు సాంస్కృతిక, శాస్త్రీయ రంగాల్లో చైనా అభివృద్ధి చెందడానికి ఎనలేని కృషి చేశారు. వీరి పేరుతో రూ.566 కోట్లతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, 'టాంగ్' ప్రైజ్ ఇవ్వాలని ఇన్ నిర్ణయించారు.

ప్రతి రెండేళ్లకోసారి ఇచ్చే ఈ పురస్కారాలలో జీవ ఔషధ శాస్త్రం, సుస్థిరమైన అభివృద్ధి, చైనా గురించిన పరిశోధనలు, అక్కడి చట్టాలు తదితర రంగాలలో కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మానవాళి అభివృద్ధిలో ఈ రంగాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యానే ఈ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వాలనుకొంటున్నామని యిన్ చెబుతున్నారు.

వచ్చే ఏడాది అంటే, 2013-14 సంవత్సరం నుండి ఈ బహుమతులను ఇవ్వడం ప్రారంభిస్తారు. రూ.19వేల కోట్ల విలువ చేసే తన ఆస్తులలో తన మరణానంతరం 95 శాతం ఆస్తులను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అరవై రెండేళ్ల యిన్ గత ఏడాది నిర్ణయించారు. ఎనభై వేల మందికి పైగా చైనా విద్యార్థులు చదువుకోవడానికి ఆయన సహాయం చేశారు. తైవాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక పరిశోధనాసంస్థ అకాడెమియా సినికా నియమించే ప్రత్యేక కమిటీ టాంగ్ బహుమతి విజేతలను నిర్ణయిస్తుంది.

English summary
Taiwanese businesman Samuel Yin has endowed a new Science Prize that not only gives bigger case awards than the Nobel Prizes, but supports research as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X