విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సాధారణంగా మనుషులకు పుట్టినరోజు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి పెంపుడు జంతువుల పుట్టిన రోజును జరుపుతుంటారు. కానీ విశాఖపట్నం జూ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో జన్మించిన మూడు తెల్లపులుల పుట్టిన రోజును బుధవారం ఘనంగా నిర్వహించారు.

విజయ్, సోని, బేతని అనే పులులకు జన్మదిన వేడుకలు జరిపారు. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఈ వేడుకకు సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్‌కట్‌ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఐదో పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు పులి మాస్క్‌ ధరించి సందడి చేశారు.

 విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక


తెల్లపులులు పుట్టినప్పుడు వాటిని జాగ్రత్తగా సాకిన అప్పటి జంతు సంరక్షకుడు అప్పన్నను అధికారులు సన్మానించారు. పిల్లలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచారు.

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక


కె. విద్యాసాగర్ అనే వ్యక్తి కార్యక్రమానికి రాలేకపోయినా కుమారి అనే తెల్లపులిని ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి వీలుగా రూ. 1.90 లక్షల చెక్కు పంపించారు.

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక


సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ విజయ్ అనే తెల్లపులిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక


జూ పార్క క్యూరేటర్ సతీమణి స్నేహ తన వంతు సాయంగా రూ. 10వేలు, జూ పార్క్ వైద్యుడు శ్రీనివాస్ రూ. 10వేలు, సహాయ క్యూరేటర్ అలీ మషాడీ రూ. 5 వేలు, డీఎఫ్ఓ వేణుగోపాల్ రూ.10వేలు విరాళాలుగా ఇచ్చారు.

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

విశాఖలో పులులకు పుట్టిన రోజు వేడుక

ఇలా మొత్తంగా రెండు తెల్ల పులుల దత్తత కోసం రూ. 2.80 లక్షలు వచ్చాయి. విశాఖ జూ పార్కులో శిరీష్, కుమారి అనే జంటకు ఈ తెల్ల పులి పిల్లలు జన్మించాయి.

English summary
On Wednesday morning, the place was decorated with flowers and balloons. Hundreds of guests arrived including some dignitaries in cars. Invitations were despatched to the guests the previous day through calls and texts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X