హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మండలి ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇక, కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లోని బస్‌డిపో గ్రౌండ్‌లో వైభవంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పాల్గొన్నారు.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

రవీంద్ర భారతిలో ఘంటసాల ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆడారు. వరంగల్‌కు చెందిన సమ్మక్క, హైదరాబాద్‌కు చెందిన శ్యామల, నల్లగొండకు చెందిన హేమలత బృందాలు బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం 12 మెట్ల కిన్నెర వాయిద్యాన్ని మొగులయ్య వాయిస్తూ, పాటలు పాడి అలరించాడు.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

వరంగల్‌ కలెక్టరేట్‌లోనూ ఉద్యోగులంతా బతుకమ్మ ఆటపాటలతో మైమరచిపోయారు. నల్లగొండ జిల్లా నూతన్‌కల్‌ మండల పరిధిలోని చిననెమిల గ్రామంలో మంగళవారం రాత్రి బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఇక.. ‘గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ కావాలి' అనే నినాదంతో తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక బస్సు యాత్ర గోదావరిఖనికి చేరుకుంది.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ పీపుల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపీఏడీ) ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి టెక్సా‌స్‌లో జరిగే బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పాల్గొననున్నారు. 23, 24 తేదీల్లో కాలిఫోర్నియా, డెట్రాయిట్‌లలో జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఒకవైపు బతుకమ్మ సంబరాలు..మరోవైపు నవరాత్రి ఉత్సవాలతో మహానగరం మరోసారి పండుగ శోభను సంతరించుకుంది. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న బతుకమ్మ ఆటాపాటా కోసం వివిధ ప్రభుత్వ విభాగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమై ఉన్నాయి.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

అదే విధంగా మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారి ఆలయాలల్లో ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. ఉదయం ఆరు గంటల నుంచే పలు ఆలయాల్లో భక్తుల సందడి కన్పించింది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిదిరోజుల పాటు నిష్టగా పూజలు చేసి చివరి రోజైన దశమి రోజున నిమజ్జనం చేయటం ఆనవాయితీ.

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

ఘనంగా బతుకమ్మ: విశేష స్పందన

నగరంలో గతంలో కేవలం పదుల సంఖ్యలో ఏర్పాటయ్యే అమ్మవారి మండపాలు ప్రతి ఏడు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏటా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేందుకు వీలుగా పలు కాలనీ సంక్షేమ సంఘాలతో పాటు వివిధ స్వచ్ఛంధ సంస్థలు సైతం ఏర్పాట్లు చేస్తున్నాయి.

English summary
Bathukamma festival in telangana Assembly held on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X