నది అడుగు భాగాన.. 300 ఏళ్ల నాటి భారీ గుప్తనిధి

దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.

బీజింగ్: దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10 వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని వారు పేర్కొన్నారు.

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు చెప్పారు.

Chinese archaeologists discover huge underwater treasure

మిన్ జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్ జియాంగ్ నదీ గర్భంలో ఈ సంపద బయటపడినట్లు సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ వెల్లడించారు.

1646లో ఆ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్ జియాంఝాంగ్.. మింగ్ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరో చోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నదిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయటపడిందని చెప్పారు.

సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మొదలు పెట్టడంతో ఈ నిధి బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+