ప్రపంచంలో 'ది బెస్ట్ సిటీ' ఇదే!.. అత్యంత చెత్త నగరమేంటో తెలుసా?

Subscribe to Oneindia Telugu

లండన్: ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో అత్యంత తక్కువ స్థాయి జీవన ప్రమాణాలు కలిగిన చెత్త నగరంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ నిలిచింది.

ప్రముఖ మెర్సర్ సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం స్పష్టమైంది. 231నగరాల్లో అభిప్రాయ సేకరణ జరిపి.. అత్యుత్తమ నగరాల జాబితాతో మెర్సర్ సంస్థ ఒక జాబితాను తయారుచేసింది. వరుసగా ఎనిమిదో సారి వియన్నా ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Cities that offering the highest quality of life

ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం,రాజకీయ స్థిరత్వం, రవాణా ప్రమాణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. కాగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలు టాప్-30లో కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

వియన్నా తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్ లు వరుసగా టాప్-5 స్థానాల్లో నిలిచాయి. అమెరికా నుంచి శానిఫ్రాన్సిస్కో నగరం మాత్రమే టాప్-30లో చోటు దక్కించుకుంది. ఈ నగరానికి జాబితాలో 29వ స్థానం దక్కింది. మరో ఆసియా నగరం సింగపూర్ కు 47వ స్థానం దక్కింది. హాంగ్ కాంగ్ 71, కౌలాలంపూర్ 86, బ్యాంకాక్ 131, మనీలా 135, షాంఘై 102, జకర్తా 143 స్థానాల్లో నిలిచాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vienna, Austria's grand capital on the Danube river, was ranked first for the eighth year in a row, while Baghdad is again considered the worst place to live.
Please Wait while comments are loading...