వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విధుల్లో పారదర్శకత కోసం.. మెరుగైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వినూత్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశంలోనే మెరుగైన పోలీసింగ్ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని సరికొత్త టెక్నాలజీని ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టారు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.

ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా ఐవోర్న్ కెమెరాలను ప్రవేశపెట్టిన సైబరాద్ కమిషనరేట్ ట్రాఫిక్ విధులను మరింత పటిష్టపరచనుంది. అత్యంత అధునాతన టెక్నాలజీగా భావించే ఈ ఐ వోర్న్ కెమెరాలు 32 జీబీ కెపాసిటీతో 21 గంటల పాటు నిరంతరాయంగా ట్రాఫిక్ దృశ్యాలను రికార్డు చేయనున్నాయి.

అలాగే సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే ప్రతీ పోలీస్‌ కు ట్యాబ్ అందించడంతో.. చలాన్ లకి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ట్రాఫిక్ పోలీసుల వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ద్రుష్టి పెడుతూ.. షూస్, సన్‌గ్లాస్, నోస్ మాస్క్, జాకెట్, రెయిన్ కోట్, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్ బ్యాగులను వారికి అందజేశారు.

కాగా, ఐవోర్న్ కెమెరాలతో సరికొత్త ట్రెండ్ నాంది పలికారు సైబరాద్ పోలీసులు. ఐవోర్న్ కెమెరాలను ప్రవేశపెట్టడంతో ఇకపై వాహనదారులతో ట్రాఫిక్ పోలీస్ మాట్లాడే తీరు, వాళ్ల ప్రవర్తన అంతా కూడా ప్రతీది రికార్డయ్యే అవకాశం ఏర్పడింది.

దీంతో ఎవరైనా తాగి రోడ్డు మీద హల్ చల్ చేసినా.. ట్రాఫిక్ పోలీస్ పై జులుం ప్రదర్శిచినా.. విషయమేదైనా సరే.. ఇక ప్రతీ ఒక్కటి కెమెరా కంటికి చిక్కాల్సిందే. దీనివల్ల తప్పుడు అభియోగాలకు చెక్ పడడమే కాకుండా, విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు మితిమీరి ప్రవర్తించకుండా కట్టడి చేసేందుకు మార్గం ఏర్పడినట్టయింది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఐవోర్న్ కెమెరాలను ట్రాఫిక్ పోలీస్ కంటి అద్దాలకు కుడి భాగంలో అమర్చారు. దీంతో ట్రాఫిక్ విధుల్లో పోలీసుల ప్రతీ కదలిక కెమెరాలో రికార్డవుతుంటుంది.

కాగా, ఈ ఐవోర్న్ కెమెరాలను నేరుగా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడంతో.. నగరంలో ప్రతీ ట్రాఫిక్ అధికారి విధులను కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఐవోర్న్ కెమెరాలను ప్రస్తుతం కూకట్ పల్లి, మాదాపూర్ పోలీసులకు అందించారు. సీపీ సీవీ ఆనంద్ గురు, శుక్రవారాల్లో ట్రాఫిక్ అధికారులకు వీటిని అందించారు.

రెండువైపులా వీడియో, ఆడియోలను రికార్డు చేసుకునే సామర్థ్యం ఈ కెమెరాలకు ఉండడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణల వంటి వాటికి తావు లేకుండా నగర పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మారేందుకు అవకాశం ఏర్పడిందన్నారు సీపీ సీవీ ఆనంద్. ట్రాఫిక్ అధికారులకు ట్యాబ్‌లు..

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ఐవోర్న్ కెమెరాలను పరిశీలించడం కోసం సీపీ సీవీ ఆనంద్ కి కెమెరా గ్లాసెస్ ని అమర్చుతున్న ద్రుశ్యం. సైబరాబాద్ పరిధిలో ఐవోర్న్ కెమెరాలను ప్రవేశపెట్టడంతో, వాటి పనితీరును పరిశీలించడం కోసం సీపీ సీవీ ఆనంద్ వాటిని ధరించారు.

 ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ఐవోర్న్ కెమెరాలతో పాటు.. ట్రాఫిక్ విధులు నిర్వర్తించే ప్రతి పోలీస్ ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని, వాటర్ బాటిల్స్, సన్ గ్లాసెస్, షూస్, నోస్ మాస్క్, జాకెట్, రెయిన్ కోట్, కూడిన కిట్ బ్యాగులను వారికి అందజేశారు.

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

సైబరాబాద్ ట్రాఫిక్ విధులు నిర్వర్తించే ప్రతీ పోలీసుకు ట్యాబ్స్ కూడా అందించారు. ఐవోర్న్ కెమెరాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నగర పోలీస్ సిబ్బందితో సీపీ సీవీ ఆనంద్.

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

ట్రెండ్ సెట్ చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. (పిక్చర్స్)

English summary
Cyberabad police commissionerate set a new trend in traffic duties. commissioner cv anand introduced i worn cameras in the region of commissionarate to prevent the fake
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X