మెదడు నుండి 2 కిలోల కణితి తొలగించిన ముంబై డాక్టర్లు

ముంబై: భారతీయ డాక్టర్లు ఓ రోగి మెదడులోని అతి పెద్ద కణితిని ఏడుగంటలపాటు శస్త్రచికిత్స చేసి తొలగించారు. రెండు కిలోల బరువున్న ఈ కణితిని జాగ్రత్తగా రోగి నుండి బయటకు తీసినట్టుగా వైద్యులు ప్రకటించారు.

శాంత్‌లాల్ పాల్ అనే 31 ఏళ్ళ ఓ దుకాణ యజమాని ఫిబ్రవరి 14వ, తేదిన ముంబైలోని బివైఎల్ ఆసుపత్రిలో చేరారు. దీంతో రోగిని పరీక్షించిన తర్వాత బుధవారం నాడు ఆపరేషన్ చేసి రోగి మెదడులోని ఉన్న రెండు కిలోల బరువున్న కణితిని తొలగించారు.

Doctors at a Mumbai hospital remove ‘heaviest recorded’ brain tumour

ఈ కణితి తొలగింపు అత్యంత కష్టసాధ్యమైన ఆపరేషన్‌గా వైద్యులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోగి మెదడు నుండి కణితిని తొలగించినట్టు ఆసుతప్రి న్యూరోసర్జన్ విభాగాధిపతి త్రిమూర్తి నందకర్ణి చెప్పారు

ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి సుమారు 7 గంటల సమయం తీసుకొందని నందకర్ణి చెప్పారు. అంతేకాదు రోగికి సుమారు 11 యూనిట్ల రక్తాన్ని ఎక్కించినట్టు ఆయన చెప్పారు. రోగి మెదడు నుండి తొలగించిన కణితి ఒక్క కిలో 87 గ్రాముల బరువుందని డాక్టర్లు ప్రకటించారు.

మెదడు నుండి జాగ్రత్తగా కణితిని తొలగించినట్టుగా నందకర్ణి చెప్పారు. కణితి ఉన్న సమయంలో రోగికి తక్కువ చూపు ఉండేదన్నారు. మరోవైపు కణితిని తొలగించిన తర్వాత చూపులో మార్పు వచ్చిందన్నారు.

రోగి ప్రస్తుతం నడుస్తున్నాడని, ఆహరం కూడ తీసుకొంటున్నాడని వైద్యులు చెప్పారు. అయితే అత్యంత ఎక్కువ బరువున్న కణితిని తొలగింపు రికార్డుగా వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+