హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంజాన్ మాసం రావడానికి ఇంకా పదిహేను రోజుల సమయముంది. ఇంకా రంజాన్ మాసం రాకముందే నగరంలో హలీం ఘుమఘులు నగర వీధుల్లోకి వచ్చేశాయి. సంప్రదాయ ఇరానీ హలీం రుచులను అందిస్తున్నామంటూ మసాబ్ ట్యాంక్ వద్ద నున్న 555 కేఫ్ ఆదివారం నుంచే హలీం కౌంటర్‌ను ప్రారంభించింది.

ఆదివారం సాయంత్రం రంగురంగుల షామియానాలు, అందమైన అలంకరణతో రంజాన్ వేడుకను తలపిస్తూ నిర్వహించిన హలీం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ తారలు, మోడల్స్ పాల్గొని హలీంని స్థానికులతో కలిసి ఆస్వాదించారు. కరాటే ఛాంపియన్ ఫలక్‌తో పాటుగా మిస్ ట్విస్ సిటిస్ 2016 సిమ్రత్ , మోడల్ నిలోఫర్ ఈ హలీం రుచిని ఆస్వాదించారు.

కాగా, ఈ కార్యక్రమంలో కేఫ్ 555 అధినేత అలీ రెజా మాట్లాడుతూ కేవలం రంజాన్ మాసంలో మాత్రమే అందించే హలీంను ఈ సంవత్సరం పక్షం రోజులు ముందుకు జరిపి 555 కేఫ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. హైదరాబాద్ నగరానికి హలీంని పరిచయం చేసిన ఇరానీ కుటుంబానికి చెందిన అలీ రెజా నిర్వహిస్తున్న 555 కమ్మని హలీంను అందించే కేఫ్‌లలో ఒకటి.

హలీం వంటకం కూడా మీర్ మహబూబ్‌అలీఖాన్ హయాంలోనే ఆయన వంటశాలలో మొదటిసారిగా తయారైంది. నగరంలో వందేళ్ల క్రితం అంటే 1866-1911 మధ్యకాలంలో హైదరాబాద్‌ను పాలించిన ఆరోనిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వంటశాలలో హలీంను ప్రత్యేకంగా తయారు చేయించి అతిథులకు వడ్డించారు.

సిటీలో మొదటి హలీం విక్రయ కేంద్రం మాత్రం 48ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇరాన్ నుంచి వచ్చిన హుస్సేన్ జాబిత్ పాతబస్తీలోని మదీనా హోటల్‌లో విక్రయాలను చేపట్టారు. అలా మొదలైన హైదరాబాద్ హలీం ప్రస్థానం నేడు ప్రపంచం నలుదిశలా వ్యాపించింది.

మీర్ మహబూబ్ అలీ వ్యక్తిగత సైన్యం కోసం యమన్, సౌదీ, అరబ్‌దేశాల నుంచి ధీరులైన రక్షభటులను ప్రైవేట్ సైన్యం కోసం అక్కడి నుంచి రప్పించారు. వారు ఇక్కడికి వచ్చాక ఇక్కడి రోజువారి ఆహారాలు కాకుండా వారు ప్రత్యేకంగా తయారు చేసుకోవడానికి వంట మనుషులను సైతం తెచ్చుకున్నారు.

 హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

వచ్చిన సైనికులు ఉదయం పూట తొందరగా ఆకలికాని, ఎక్కువ సేపు ఆహారం లేకుండానే ఉండేందుకు గోధుమలు, నెయ్యి, మాంసంతో ఓ పదార్థాన్ని తయారు చేశారు. గతంలో దీన్ని హరీస్ అనేవారు. ఆ కాలంలో స్వచ్ఛమైన గోధుమలు, నెయ్యి, మాంసాన్ని సమభాగంలో కలిపి ఉడికించి, తరువాత దంచి తినేవారు.

 హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

కాలానుగుణంగా ఇక్కడే ఉండిపోయిన అరబ్‌లు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలు, వేడుకల్లో తయారుచేసి తినేవారు. 6వ నిజాం కాలంలో కూడా అరబ్ దేశంలోని సైనికులతో పాటు ఇక్కడి వారి శారీరక దారుఢ్యం కోసం వడ్డించేవారు. రాను రాను ఇది కేవలం అరబ్బులతో పాటు హైదరాబాద్‌లో నివసించే నవాబు, రాజవంశీకుల ఇళ్లలో కూడా తయారు చేస్తూ అతిథులకు వడ్డించే వారు.

 హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. దేశంలోని అన్ని నగారాల కంటే హైదరాబాద్ నగరానికి రంజాన్ మాసం ప్రత్యేకత ఉంది. రంజాన్ మాసం లో అరబ్బు, పర్షియన్, ఇరానీ, యమన్‌తో పాటు కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల కాలంలో వండిన దక్కనీ, మొగలాయి వంటకాలను నగర ప్రజలకు అందిస్తున్నారు.

 హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

హలీం సందడి: ప్రారంభించిన మిస్ ట్విన్ సిటిస్

హలీంను ముస్లింలే కాకుండా అన్నివర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. గతంలో కేవలం ధనికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారి కోసమే ప్రత్యేకంగా హలీం వంటకాలను ఫంక్షన్లు, ఇతర వేడుకల్లో తయారుచేసేవారు. నేడు హలీంను నగరంతో పాటు ఇతర రాష్ర్టాలు, దేశ, విదేశాలకు ఎగమతి చేస్తున్నారు.

English summary
haleem started in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X