కార్పోరేట్ సాయం, విశాఖపై బాబు ఆర్కిటెక్(పిక్చర్స్)

విశాఖపట్నం: హుధుద్ తుపాను ధాటికి అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల బాధితులను ఆదుకునేందుకు వివిధ కార్పొరేట్ కంపెనీలు ముందుకువస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద సేవా కార్యక్రమాల్లో భాగంగా తుపాను బాధితులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బహుళ జాతి సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.

కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చమురు, సహజవాయు సంస్థలు తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమయ్యాయి. విద్యుత్, తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాల్లో సాంకేతిక సహాయాన్ని అందించాలని కోరారు. రహదారులు, భవనాలపై కూలిన వృక్షాలను తొలగించేందుకు అవసరమైన 50వేల రూపాయల విలువ చేసే 5 పవర్ సా మిషన్స్‌ను జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు శనివారం అందజేశారు.

రిలయన్స్ 10 లక్షల విలువైన ఆహార పదార్ధాలను పంపిణీ చేసింది. ఒఎన్‌జిసి, గెయిల్, కెయిర్న్ ఎనర్టీ, కాకినాడ సీపోర్ట్ తదితర సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ద్వారా 25వేల అరటి పండ్లు, 11వేల ఆపిల్ పండ్లు, 3,600 పాల ప్యాకెట్లు, 10వేల వాటర్ ప్యాకెట్లను బాధిత ప్రాంతాలకు పంపారు. ఒఎన్‌జిసి సంస్థ 14వేల ఆపిల్ పండ్లు, 1400 అర లీటర్ పాల ప్యాకెట్లు, 40వేల మంచి నీటి ప్యాకెట్లు, 10వేల బిస్కెట్ ప్యాకెట్లు బాధితులకు అందజేశారు.

ఆయిల్ ఇండియా ద్వారా పాలప్యాకెట్లు, బ్రెడ్లు, ఆపిల్స్ పంపారు. బాధితులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్లు, ఆహార పొట్లాలను ఆయా కార్పొరేట్ సంస్థల ద్వారా నిరంతరాయంగా విశాఖ ప్రాంతానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. శనివారం ఆరు టన్నుల కూరగాయలు, లక్షా 86వేల కొవ్వొత్తులు, విరాళం ద్వారా వచ్చిన 3.62 మెట్రిక్ టన్నుల బియ్యం, 2వేల 500 బిస్కెట్ ప్యాకెట్లు, సుమారు 8 లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపినట్టు చెప్పారు.

హుధుద్

హుధుద్

మానత్వం, మనోనిబ్బరం కలగలిపిన మానవమూర్తులు ఇప్పుడు విశాఖ ప్రజలకు అండదండగా నిలిచారు. వారంతా ఒక సైన్యంలా కదులుతున్నారు.

 హుధుద్

హుధుద్

లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. అన్నపానీయాలపై వారి దృష్టి లేదు. అందాల విశాఖను పునర్నిర్మించడంలో నిమగ్నమై ఉన్నారు.

హుధుద్

హుధుద్

12వ తేదీ నుంచి నేటి వరకూ విశాఖ నగరంలో నలుచెరగుల సహాయ సహకారాలు అందిస్తున్న వారి సేవలను వర్ణించడానికి అక్షరాలు చాలవు.

 హుధుద్

హుధుద్

ఎన్‌డిఆర్‌ఎఫ్, ట్రాన్స్‌కో, ఫైర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్ సిబ్బంది తుపానులో దెబ్బతిన్న నగరం కుదుటపడేలా చర్యలు తీసుకుంటున్నారు.

 హుధుద్

హుధుద్

రాత్రనక, పగలనక వీరు చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మున్సిపల్ సిబ్బంది నగరంలోని చెత్తను ఏరేస్తోంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్లకు అడ్డంగా విరిగి పడిన చెట్లను తొలగిస్తోంది.

 హుధుద్

హుధుద్

ఒడిశా నుంచి వచ్చిన ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది కూడా ఇదే బాటలో పయనిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సిబ్బందికి ఇక్కడ భాష రాదు. ఈ ప్రాంతం పూర్తిగా కొత్త.

 హుధుద్

హుధుద్

ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది అయితే ఎవ్వరితోనూ మాట్లాడ్డం లేదు. ఇచ్చిన పని చేయటం ఒక్కటే వారికి తెలుసు. వేళకు ఆహారం దొరికినా, దొరకకపోయినా, అధికారులు చెప్పిన పని చేసుకుంటూ పోతున్నారు.

 హుధుద్

హుధుద్

గత ఆదివారం నగరానికి వచ్చిన వారే ఇప్పటికీ సహాయక చర్యలు అలుపెరగకుండా కొనసాగిస్తున్నారంటే వారి కర్తవ్య దీక్షను అర్థం చేసుకోవచ్చు. మంగళవారం నుంచి నగర ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నారు.

హుధుద్

హుధుద్

ఎవరి విధులకు వారు హాజరవుతున్నారు కానీ నగరానికి వచ్చిన సహాయక బృందాలు మాత్రం నగరాన్ని సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మున్సిపల్ సిబ్బంది కూడా అలుపు లేకుండా పనిచేస్తున్నారు.

 హుధుద్

హుధుద్

హుధుద్ తుపానులో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అనేక సుందర నగరాలను నిర్మించిన ఆర్కిటెక్ట్‌లను చంద్రబాబు నగరానికి రప్పిస్తున్నారు.

హుధుద్

హుధుద్

అందులో భాగంగా చెన్నై నుంచి శేఖర్ జైన్ శనివారం విశాఖకు చేరుకున్నారు. ప్రపంచంలో సుందర భవనాలను నిర్మించిన చరిత్ర ఉన్న జైన్ శనివారం నగరానికి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

 హుధుద్

హుధుద్

అలాగే సింగపూర్ నుంచి కూడా కొంతమంది ఆర్కిటెక్ట్‌లు నగరానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యానవన శాఖ అధికారులను, సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు.

 హుధుద్

హుధుద్

తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఉద్యానవన నిపుణులు విశాఖ చేరుకుంటున్నారు. ఇకపై తుపానులను తట్టుకోగలిగే మొక్కలు నాటనున్నట్టు చంద్రబాబు నాయుడు తెలియచేశారు.

 హుధుద్

హుధుద్

దెబ్బతిన్న చెట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే విశాఖలో అందమైన టౌన్‌షిప్‌ల నిర్మాణానికి వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు శనివారం మాట్లాడారు.

 హుధుద్

హుధుద్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తుపాను బాధితుల కోసం రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇది సుమారు 125 కోట్ల రూపాయలు ఉంటుంది.

 హుధుద్

హుధుద్

ఇందులో 10 నుంచి 25 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తానని, ప్రభుత్వం మరో పది కోట్ల రూపాయలు ఇస్తుందని, ఈ మొత్తంతో ఉద్యోగుల జెఎసి తరుపున విశాఖలో మత్స్యకారులకు అత్యాధునికమైన కాలనీని నిర్మించి ఇవ్వాలని జెఎసి నాయకుడు అశోక్‌బాబుకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

హుధుద్

హుధుద్

అలాగే ఇన్ఫోసిస్, రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడుకు శనివారం భారీగా విరాళాన్ని అందించారు. వారిచ్చిన మొత్తాన్ని రెట్టింపు చేయాలని చంద్రబాబు సూచించారు.

 హుధుద్

హుధుద్

దానికి ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని, ఈ మొత్తంతో పేద ప్రజలకు విశాఖలో సుందరమైన టౌన్‌షిప్ నిర్మించాలని చంద్రబాబు సూచించారు.

 హుధుద్

హుధుద్

ఇందుకు కావల్సిన భూమిని ప్రభుత్వమే ఇస్తుందని చంద్రబాబు తెలియచేశారు. సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారికి ఎప్పటికప్పుడు ప్రోగ్రాం ఇస్తూ, విశాఖను బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్పారు.

 హుధుద్

హుధుద్

ఇదే వేగంతో పనిచేస్తే, విశాఖ నగరం మరొక్క సంవత్సర కాలంలో బెస్ట్ సిటీగా రూపుదిద్దుకోవడంలో సందేహం లేదు. ప్రజల ఆస్తుల రక్షణకు పోలీసు శాఖ ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర డిజిపి జివి రాముడు స్పష్టం చేశారు.

హుధుద్

హుధుద్

తుపాను ప్రభావిత విశాఖలో శనివారం పర్యటించిన ఆయన పోలీసు యంత్రాంగం విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉందన్నారు. హుదూద్ తుపాను విధ్వంసంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజల ఆస్తులకు పోలీసు వ్యవస్థ పూర్తి రక్షణ కల్పిస్తోందని అన్నారు.

 హుధుద్

హుధుద్

ప్రస్తుతం ప్రజలున్న నిస్సహాయ స్థితిని ఆసరాచేసుకుని దొంగలు పెచ్చుమీరి పోకుండా గస్తీ వ్యవస్థను పటిష్ఠం చేశామని తెలిపారు. పోలీసు వ్యవస్థ మొత్తం విఐపిల భద్రతకోసం పనిచేస్తున్నట్టు భావించాల్సిన అవసరం లేదన్నారు.

 హుధుద్

హుధుద్

ఇక తుపాను బాధితులకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సహాయం పక్కదారి పట్టకుండా భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీలో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన బందోబస్తు కల్పిస్తోందని తెలిపారు.

 హుధుద్

హుధుద్

తుపాను విధ్వంసాన్ని ఆసరా చేసుకుని వ్యాపారస్తులు నిత్యావసరాలను నల్ల బజారులో విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బ్లాక్‌మార్కెటీర్లపై స్థానికులు పోలీసు కంట్రోల్‌రూంకు సమాచారం ఇస్తే వారి ఆగడాలను అణచివేస్తామని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర సహా, తూర్పుగోదావరి జిల్లాల్లో పోలీసు శాఖ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని డిజిపి స్పష్టం చేశారు.

 హుధుద్

హుధుద్

పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ యంత్రాంగం ద్వారా ఆస్తి నష్టాన్ని అంచనా వేయిస్తున్నామని, మరో రెండు రోజుల్లో నష్టంపై పూర్తి సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.

 హుధుద్

హుధుద్

అంతకు ముందు ఆయన నగర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించే విషయమై ఆరా తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+