ఎందుకు ఆ ఒక్కరోజే?: హైదరాబాద్ నేరాలపై బయటపడ్డ ఆశ్చర్యకర నిజం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజధాని పరిధిలో జరుగుతున్న నేరాలపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేరాల తీరును పరిశీలించేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు.

నెలల వారీగా క్రైమ్ రేటును పరిశీలిస్తున్న పోలీసులు.. ఏ ప్రాంతాల్లో, ఏ రోజుల్లో ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయో గుర్తిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.

 యాప్ ద్వారా

యాప్ ద్వారా

ఈ ఏడాది అక్టోబర్ వరకు నమోదైన బంగారం చోరీ నేరాలను పోలీసులు లోతుగా విశ్లేషించారు. ఆసక్తికరంగా శనివారం రోజే ఈ నేరాలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. ఒక్కో వారం, ఒక్కో తరహా నేరం జరుగుతున్నట్టు నిర్దారించారు. నేరాలకు సంబంధించిన వివరాలను, ఆయా ప్రాంతాలను తమ యాప్ సర్వర్ లో అధికారులు ఎంట్రీ చేయిస్తున్నారు. తద్వారా క్రైమ్ ప్రోన్ ఏరియాలను దృష్టిలో పెట్టుకుని నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు.

 శనివారమే ఎక్కువ:

శనివారమే ఎక్కువ:

ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు జరిగిన నేరాలను లోతుగా అధ్యయనం.. ఎక్కువ శాతం నేరాలు శనివారమే చోటు చేసుకున్నట్టు తేలడం గమనార్హం. శనివారమే ఎందుకు ఎక్కువగా నేరాలు నమోదవుతున్నాయన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో క్రైమ్ ప్రోన్ ఏరియాలను యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

 క్రైమ్ మ్యాపింగ్

క్రైమ్ మ్యాపింగ్

నేరాల సమగ్ర వివరాల కోసం పోలీస్ శాఖ బాగానే కసరత్తులు చేసింది. ఇందులో భాగంగానే 'క్రైమ్ మ్యాపింగ్' యాప్ రూపొందించింది. అలాగే జరుగుతున్న నేరాలు ఏ తరహావో చెప్పడానికి 'థిమేటిక్ క్రైమ్ మ్యాప్' ను రూపొందించింది. దీంతో నగరంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇందులో వివరాలు పొందపరచనున్నారు. ఈ యాప్ లోకి ప్రవేశిస్తే నేరాల తీరు తెన్నులను తెలుసుకోవడం చాలా సులువు కానుంది.

 ఏ రోజు.. ఏ తరహా నేరం

ఏ రోజు.. ఏ తరహా నేరం

ప్రస్తుతం క్రైమ్ మ్యాప్ యాప్ లో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం, దొంగతనాలు వంటి కేసుల వివరాలు నమోదు చేశారు. నగరంలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా ఎక్కడ నేరాలు నమోదవుతున్నాయో గుర్తించడానికి పోలీసులకు ఇది వీలు కల్పించింది. తద్వారా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులను కూడా మార్చే అవకాశముంది.

ఈ ఏడాది అక్టోబర్ వరకు హైదరాబాద్ లో సొత్తు సంబంధిత నేరాలు 2169నమోదయ్యాయి. ఇందులో 339నేరాలు ఒక్క శనివారం నాడే జరిగాయి. దోపిడీలు, హత్యలు, పగటి చోరీలు శనివారం ఎక్కువగా చోటు చేసుకున్నట్టు గుర్తించారు. ఇక వాహన చోరీలు సోమవారం ఎక్కువగా చోటు చేసుకున్నట్టు గుర్తించారు.

మొత్తం 671వాహన చోరీ కేసుల్లో.. 113 కేవలం సోమవారం నాడు చోటు చేసుకున్నవే. ఇక దృష్టి మళ్ళించి దోచుకునే నేరాలు గురువారం నాడు ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో మొత్తం 97నేరాలకు ఈ వారంలోనే 22చోటు చేసుకున్నాయి. రాత్రి పూట చోరీలు సైతం గురువారమే ఎక్కువగా చోటు చేసుకోవడం గమనార్హం. 219కేసుల్లో 37కేసులు గురువారమే నమోదయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Interesting facts are revealed in Hyderabad police analysis about crime rate in city.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి